హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటిలో దూసుకెళ్తున్నాం: ఏపీ మంత్రిలా మారిన కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా టాప్-3లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిపై మంత్రి కెటిఆర్ కీలకోపాన్యాసం చేశారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్, ఐటి పరిశ్రమలు అనేక రంగాలకు సంబంధించి అనేక సందేహాలు ఉండేవని, సమర్ధవంతమైన పాలనతో సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్టు చెప్పారు. గత 12 నెలల కాలంలో సింగిల్ విండో విధానంలో 2300 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, లక్షా 30వేల మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి లభించిందన్నారు.

సెల్ఫ్ డిక్లరేషన్ విధానం కింద అవినీతికి తావులేని సింగిల్ విండో విధానంలో 15రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యున్నత పారిశ్రామిక విధానమని దేశ దేశాలకు చెందిన కంపెనీలు అభినందిస్తున్నాయని తెలిపారు. టి-హబ్‌లో 200 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఐటి పాలసీ ప్రవేశపెట్టినట్టు చెప్పారు.

ఐటి ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీని అత్యున్నతస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం 13వేల ఎకరాల భూమి సేకరిస్తామని, ప్రస్తుతం ఆరువేల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు.

ఏపీ మంత్రిలా మారిపోయిన కెటిఆర్

బెంగళూరుకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపూర్(బీడిఎల్ ప్లాంట్), తిరుపతిలో టెక్నాలజీ ఇంక్యూబేటర్ పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మొదట ఇవీ రెండూ కూడా ఏపీలో ఉన్నాయని చెప్పిన కెటిఆర్.. ఆ తర్వాత ఏపీ మంత్రిలాగా మాట్లాడారు.

తిరుపతి నగరం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంటుందని, అలాగే హిందూపూర్ కూడా బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు సమీపంలోనే ఉన్నందున ఈ ప్రాంతాలు పరిశ్రమలకు అనుకూలమని తెలిపారు.

నగరాల మధ్య పోటీ మంచిదని, అది భారతదేశంలోనే గాక ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 24నగరాలను కాదని యాపిల్ సంస్థ తన మేజర్ హబ్‌ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని వివరించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా టాప్-3లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఈ సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిపై మంత్రి కెటిఆర్ కీలకోపాన్యాసం చేశారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్, ఐటి పరిశ్రమలు అనేక రంగాలకు సంబంధించి అనేక సందేహాలు ఉండేవని, సమర్ధవంతమైన పాలనతో సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

గత 12 నెలల కాలంలో సింగిల్ విండో విధానంలో 2300 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, లక్షా 30వేల మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి లభించిందన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

సెల్ఫ్ డిక్లరేషన్ విధానం కింద అవినీతికి తావులేని సింగిల్ విండో విధానంలో 15రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యున్నత పారిశ్రామిక విధానమని దేశ దేశాలకు చెందిన కంపెనీలు అభినందిస్తున్నాయని తెలిపారు. టి-హబ్‌లో 200 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఐటి పాలసీ ప్రవేశపెట్టినట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఐటి ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీని అత్యున్నతస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం 13వేల ఎకరాల భూమి సేకరిస్తామని, ప్రస్తుతం ఆరువేల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, డిసెంబర్‌లో మొదటిదశ ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఫార్మాసిటీలో ఫార్మా వర్శిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

గతంలో ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోసం ధర్నాలు చేసేవారని, ఇప్పుడు పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందజేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కామన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

కొత్త విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాక 24 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

సమావేశంలో ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం ఇచ్చారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఫిక్కి జాతీయ కార్యనిర్వహక వర్గ సమావేశంలో పారిశ్రామిక వేత్తలు మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

‘కర్ణాటక నుంచి హాజరైన ప్రతినిధులు తమ రాష్ట్రంలో వయో వృద్ధులైన నాయకులున్నారని.. వారికి తోడు అధికారులు కూడా వృద్ధులే ఉన్నారని వాపోయారు. మీ(కెటిఆర్) లాంటి యంగ్ లీడర్ మా రాష్ట్రానికి కావాలి'అన్నారు. దీనికి సమావేశంలోని ప్రతినిధులందరు హర్షధ్వానాలతో స్పందించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

‘ఢిల్లీ నుంచి హాజరైన ప్రతినిధి మాట్లాడుతూ మీ(కెటిఆర్) మాట తీరు, సమస్యలపై మీ స్పందన, విజన్ నిజంగా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలతో మరోసారి ప్రత్యేకంగా కలుస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు తెలిపారు.

English summary
IT Minister K.T. Rama Rao was forced to speak on behalf of the two Telugu States at the FICCI annual meeting, despite both States continuing to do sabre rattling on some issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X