ఏఎస్పీ సునీతరెడ్డి అఫైర్: ఆ విషయం దాచి, తెలిసినవారి ద్వారా ఆ ఫోటోలు బయటకు!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాహేతర సంబంధం కేసులో సస్పెండైన ఏఎస్పీ సునీత రెడ్డి కేసు సోమవారం కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. సస్పెండైన సీఐ మల్లికార్జున రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త సురేందర్ రెడ్డి ఆరోపించడమే కాకుండా సునీత, మల్లికార్జున రెడ్డిలు సన్నిహితంగా ఉన్న సమయంలో పట్టుకున్నారు.

చదవండి: ఎఎస్పీ సునీతారెడ్డి అఫైర్‌లో ట్విస్ట్: యాంకర్ సోదరుడితో మొదటి పెళ్లి

తాజాగా, ఆమెకు గతంలోనే పెళ్లయిందనే ఫోటోలు కలకలం రేపుతున్నాయి. వివాహేతర సంబంధం కేసు కొనసాగుతుండగానే ఫోటోలు బయటపడ్డాయి. వీటిలో నిజమెంతో, అబద్దమెంతో తేలాల్సి ఉంది. ఇప్పటికే వివాహేతర సంబంధం నేపథ్యంలో నైతిక ప్రవర్తన కింద సస్పెన్షన్ వేటు వేశారు.

చదవండి: లేడీ ఏఎస్పీతో సీఐ బాగోతం: నగరం వదలొద్దని సునీతకు ఆదేశాలు, నాయిని తీవ్ర ఆగ్రహం

భార్య చేసిన పనికి చనిపోవాలనుకున్నప్పటికీ

భార్య చేసిన పనికి చనిపోవాలనుకున్నప్పటికీ

ఆమె చేసిన పనికి తాను చనిపోవాలని అనుకున్నానని, కానీ అసలు నిజం లోకానికి చెప్పేందుకే తాను వారిద్దరి బండారం బయటపెట్టానని ఆమె భర్త పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు.

సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

ఈ సమయంలో కొత్తగా ప్రముఖ యాంకర్ సోదరుడు లెనిన్‌తో పెళ్లి, పెళ్లైన రెండేళ్లకే అతనిపై వరకట్నం కేసు పెట్టిన ఉదంతం వెలుగు చూసిందంటూ వార్తలు వచ్చాయి. ఆర్య సమాజ్‌లో పెళ్లి జరిగిందంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

మొదటి పెళ్లి దాచిపెట్టి సురేందర్ రెడ్డితో పెళ్లి

మొదటి పెళ్లి దాచిపెట్టి సురేందర్ రెడ్డితో పెళ్లి

లెనిన్‌తో మొదటి పెళ్లి పెటాకులయ్యాక సురేందర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుందని అంటున్నారు. అయితే ఆ ఫోటోలు నిజమైనవో కావో తెలియాలని అంటున్నారు. ఈ ఫోటోలు ఎవరు బయటపెట్టారో తెలియాల్సి ఉంది. ఒకవేళ అది నిజమే అయితే మొదటి పెళ్లిని దాచిపెట్టి ఆమె సురేందర్ రెడ్డిని పెళ్లి చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

ఫోటోల ఒరిజినాలిటీపై అనుమానాలు

ఫోటోల ఒరిజినాలిటీపై అనుమానాలు

తాజాగా, సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న ఫోటోలను నేరుగా పోలీసులకు అందించేలేదని, తమకు తెలిసిన వారి ద్వారా బయటపెట్టారని అంటున్నారు. అయితే ఆ ఫోటోల ఒరిజినాలిటీపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

రికార్డుల ప్రకారం.. పోలీస్ శాఖలో వ్యక్తిగత విషయాలు దాచిపెట్టి

రికార్డుల ప్రకారం.. పోలీస్ శాఖలో వ్యక్తిగత విషయాలు దాచిపెట్టి

పోలీసులు ఆ ఫోటోలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ఆమె కూడా పోలీసు శాఖలో చేరినప్పటి నుంచి రికార్డుల ప్రకారం తన భర్తగా సురేందర్ రెడ్డినే పేర్కొన్నారు. లెనిన్‌తో పెళ్లి విషయం నిజమే అయితే ఆమె పోలీసు శాఖకు తన వ్యక్తిగత విషయాలు దాచిపెట్టినట్లుగా భావించవచ్చునని అంటున్నారు. ఈ దిశలోను పోలీసులు విచారణ చేయనున్నారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
News twist in ASP Sunitha Reddy and Kalwakurthy CI Mallikarjun Reddy case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి