ఎఎస్పీ సునీతారెడ్డి అఫైర్‌లో ట్విస్ట్: యాంకర్ సోదరుడితో మొదటి పెళ్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎసిబి ఏఎస్పీ సునీతారెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె గురించి మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు మొదటి పెళ్లి యాంకర్ సోదరుడు లెనిన్‌తో జరిగినట్లు వెలుగు చూసింది.

ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్ఐ మల్లికార్జన్ రెడ్డితో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసందే.

లేడీ ఏఎస్పీతో సీఐ వివాహేతర బంధం: రెడ్ హ్యాండెడ్‌గా, చెప్పులతో కొట్టారు

మొదటి పెళ్లి పెటాకులు

మొదటి పెళ్లి పెటాకులు

సునీతారెడ్డి మొదటి పెళ్లి లెనిన్ అనే వ్యక్తితో జరిగినట్లు టీవీ చానెల్లో సోమవారం వార్తలు వచ్చాయి. అతను ఓ యాంకర్ సోదరుడని తెలుస్తోంది. ఆ పెళ్లిలో యాంకర్‌తో పాటు మరి కొంత మంది పాల్గొన్నట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.

 అప్పటికే వివాహేతర సంబంధం

అప్పటికే వివాహేతర సంబంధం

ఆమె భర్త సురేందర్ రెడ్డితో పెళ్లికి ముందే సునీతారెడ్డికి వివాహేతర సంబధం ఉందని కూడా చెబుతున్నారు. ఎస్ఐ మల్లికార్డున్ రెడ్డితో వివాహేతరర సంబంధం నేపథ్యంలో సురేందర్ రెడ్డి వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టిచ్చిన విషయం తెలిసిందే.

 లెనిన్‌తో రెండేళ్లకే గొడవలు...

లెనిన్‌తో రెండేళ్లకే గొడవలు...

పెళ్లి చేసుకున్న రెండేళ్లుకే లెనిన్‌తో సునీతారెడ్డికి గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అతనిపై వరకట్నం కేసు కూడా నమోదైనట్లు చెబుతున్నారు. అయితే, లెనిన్‌తో ఆమెకు పోలీసు శాఖలో చేరిన తర్వాత వివాహమైందా, తర్వాత వివాహమైందా అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 తన భార్యను ట్రాప్ చేశాడని...

తన భార్యను ట్రాప్ చేశాడని...

తన భార్యను మల్లికార్డున్ రెడ్డి ట్రాప్ చేశాడని సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆరోపించగా, తామిద్దరం వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు మల్లికార్జున్ రెడ్డి వాట్సప్ సందేశం ద్వారా చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to TV channel reports - ACB ASP Sunitha Reddy has married anchor brother Lenin before wedding with Surender Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి