ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!!
ఇటీవల చిన్న సినిమాలదే హవా.. సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొడుతున్న సినిమాల లిస్టు భారీగానే ఉంది. పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అవుతున్నాయి. చిన్న సినిమాలకు అలాంటి ప్రాబ్లెమ్ లేదు. అంచనాలు లేకుండానే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది అలా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ'.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరని మరోసారి రుజువైంది ఈ సినిమాతో.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జోడీగా నటించారు. ఈ పెయిర్ తమ నేచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేశారు. ముఖ్యంగా యువత, కొత్త జంటలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు ప్రభాస్ లాంటి స్టార్స్ సైతం సపోర్ట్ గా నిలిచారంటే ఈ మూవీ కంటెంట్ ఏంటో చెప్పొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీని ప్రశంసించారు. నాగార్జున గీతాంజలి మూవీతో పోల్చారు. ఏకంగా 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేసి మరీ ఈ మూవీని ఆకాశానికి ఎత్తారు. ఇక థియేటర్లలో హిట్ అయిన ఈ మూవీ మార్చి 13 న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో తెలుగుతోపాటు తమిళంలో స్ట్రీమింగ్ లో ఉంది. అయితే ఓటీటీలో కూడా సినిమా మంచి విజయం సాధించిందని మేకర్స్ తెలిపారు.

ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులు కపుల్ ఫ్రెండ్లీ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఈ మూవీకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications