ట్రంప్ కు భారత్ బిగ్ షాక్-హార్ముజ్ పై కీలక నిర్ణయం..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి 17 రోజులైపోయింది. యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అనడం కంటే ఇరాన్ ను తక్కువ అంచనా వేసిన అమెరికా-ఇజ్రాయెల్ దీని నుంచి ఎప్పుడు బయటపడతాయన్న చర్చ ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతోంది. దీంతో పట్టుదలకు పోతున్న ట్రంప్.. ఇరాన్ బ్లాక్ చేసిన హార్ముజ్ జలసంధిని ఎలాగైనా తెరిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తమ మిత్రదేశాల సాయం కోరారు. కానీ అవి స్పందించట్లేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ భారత్ (india) కూడా హార్ముజ్ జలసంధికి యుద్ద నౌకల్ని పంపే విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తిపై స్పందించింది. హార్ముజ్ జలసంధి ద్వారా వ్యాపార నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూసేందుకు నేవీ నౌకలను మోహరించడంపై అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు జరపడం లేదని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక జలమార్గాన్ని తెరిచి ఉంచడానికి యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చింది.

హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ చేసిన ప్రయత్నం వల్ల ఏర్పడిన కృత్రిమ అడ్డంకుల వల్ల ప్రభావితమైన చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఇతర దేశాలు జలమార్గాన్ని సురక్షితంగా, తెరిచి ఉంచడానికి ఆ ప్రాంతానికి తమ యుద్ధనౌకలను పంపుతాయని తాను ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ తెలిపారు. అయితే, ట్రంప్ పేర్కొన్న దేశాలు వెంటనే ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా తక్షణం స్పందించేందుకు సిద్దంగా లేదు. అందుకే ఈ వ్యవహారంపై వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి నుంచి భారత్ నౌకల్ని ఇరాన్ అనుమతిస్తున్న నేపథ్యంలో భారత్ దూకుడు చర్యలకు సిద్దంగా లేదు.
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ














Click it and Unblock the Notifications