ట్విస్ట్: భార్యతో 2 రోజులు సంతోషంగా ఉందామన్న విజయ్, అదృశ్యమైన వనితారెడ్డి?
హైదరాబాద్:సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు విషయమై నిందితులను కఠినంగా శిక్షించాలని విజయ్ తండ్రి సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే విజయ్ సాయి భార్య వనితారెడ్డితో పాటు మరికొందరు అందుబాటులో లేకుండా పోయారని పోలీసులు గుర్తించారు.
అయితే ఆత్మహత్యకు రెండు రోజుల ముందే విజయ్ సాయి వనితారెడ్డితో పోన్‌లో మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఫోన్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది. చివరి రోజుల్లో సంతోషంగా ఉండాలని విజయ్ కోరుకొన్నాడని ఆ సంబాషణను బట్టి తెలుస్తోంది.
తెలుగు సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య విజయ్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు విజయ్ సాయి సెల్పీ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియో ఆధారంగా విచారణ జరిపించాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ సాయి సెల్పీ వీడియోలో ప్రస్తావించిన విషయాలను తనను తీవ్రంగా బాధించాయని సుబ్బారావు చెబుతున్నారు.

భార్యతో సంతోషంగా ఉండాలనుకొన్నాడా
విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొనేందుకు రెండు రోజుల ముందే వనితారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఫోన్ సంబాషణ పోస్ట్ చేశారు. అయితే తమ మధ్య ఉన్న విభేధాలను మర్చి రెండు రోజుల పాటు సంతోషంగా ఉండాలనే అభిప్రాయాన్ని విజయ్ సాయి వ్యక్తం చేశారు.అయితే ఆ ఫోన్ సంబాషణ ఇటీవలే చేశారా, అంతకుముందు చేశారనే విషయమై స్పష్టత మాత్రం లేదు.

సెల్పీ వీడియో చూశానన్న సుబ్బారావు
విజయ్ సాయి సెల్పీ వీడియోను చూశానని సుబ్బారావు చెప్పాడు. విజయ్ సాయి ఎంత మానసికంగా ఇబ్బందిపడ్డాడో ఆ వీడియోలో తేటతెల్లమైందని సుబ్బారావు చెప్పారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ముగ్గురు వ్యక్తును కఠినంగా శిక్షించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు.అయితే ఈ కేసు విచారణలో పోలీసుల తీరుపై సుబ్బారావు అనుమానాలు వ్యక్తంచేశారు.

వనితారెడ్డి, శ్రీనివాస్ లు లేరా
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్ లు అందుబాటులో లేరనే ప్రచారం సాగుతోంది.రెండు రోజుల క్రితం పోలీసుల ఫోన్ కూడ వనితారెడ్డి స్పందించలేదని సమాచారం. అయితే ఈ విజయ్ సాయి సెల్పీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.ఈ కేసు విచారణలో భాగంగా వీరిని విచారిస్తేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి.

వనితారెడ్డి ఆరోపణలు అందుకేనా
విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి విజయ్ సాయిపై, విజయ్ సాయి తండ్రి సుబ్బారావుపై ఆరోపణలు చేస్తూ సెల్పీ వీడియోలు విడుదల చేయడం కూడ వ్యూహత్మకమేనని సుబ్బారావు ఆరోపిస్తున్నాడు.కారు, నగలు తీసుకెళ్ళాలని ఏ కోర్టు కూడ చెప్పలేదని సుబ్బారావు అంటున్నారు. అయితే విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఏ ఒక్కరికీ ఇంతవరకు ఎందుకు రెస్ట్ చేయలేదని సుబ్బారావు ప్రశ్నించారు. అయితే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి వనితారెడ్డి సెల్పీ వీడియోలను రికార్డ్ చేసి విడుదల చేసిందనే అభిప్రాయాన్నిసుబ్బారావు వ్యక్తం చేస్తున్నారు.విజయ్ ఆత్మహత్య చేసుకొంటాడని తాను ఉహించలేదని ఆమె సెల్పీ వీడియోల్లో ప్రకటించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications