మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులో రూ.16 లక్షల కొత్త నోట్ల తరలింపు: ఇద్దరి పట్టివేత

గుట్టు చప్పుడు కాకుండా పది లక్షల రూపాయల కొత్త నోట్లను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు ఆదివారం రూ.16 లక్షల కొత్త నోట్లను పట్టుకున్నారు. బాసం శ్రీనివాస్, రాజు అనే వ్యక్తులు కారులో కొత్త నోట్లను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో గొల్పర్తి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేసి ఈ సొమ్మును పట్టుకున్నామని ఎస్‌ఐ నాగార్జున గౌడ్ తెలిపారు. పట్టుబడిన సొమ్ములో రూ.15.90 లక్షల రెండువేల కొత్త నోట్లు, మరో రూ.10 వేల వంద రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పారు.

వారిని విచారించగా రామాయంపేట పట్టణానికి చెందిన కోవూరి వెంకట రామలక్ష్మణ్ నుంచి ప్లాట్ కొన్నామని, ఇందుకు సంబంధించిన సొమ్మును తూప్రాన్‌లో ఉన్న గంగం సంతోష్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పారని, ఈ సొమ్మును ఆదాయ పన్ను అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ వివరించారు.

Two arrested in Medak district with 16 lakhs notes

కారులో ఉన్న డబ్బులకు ఎలాంటి రశీదులు లేవని చెప్పారు. రూ.16లక్షల రూపాయలలో పదివేల రూపాయలు వంద నోట్లు కాగా మిగతా వన్ని కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లేనని తెలిపాడు.డబ్బులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు డబ్బులను పట్టణంలోనే ఓ వ్యాపారి కొవ్వూరి లక్ష్మణ్‌కు చెందినవని తెలిపాడన్నారు.

లక్ష్మణ్ తూప్రాన్‌లోని ఓ వ్యక్తికి ఇవ్వాల్సిందిగా తమకు ఇచ్చాడని డబ్బులను అక్కడ ఇవ్వడం కోసమే తీసుకెళ్తున్నామని తెలిపారన్నా రు.పట్టుబడ్డ కొత్త నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్‌ఐ తెలిపాడు.డబ్బులతో పాటు పట్టుబడ్డ మారుతీ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు.ఇద్దరూ వ్యక్తులపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

English summary
Medak district police seized Rs 16 lakh new notes, while transporting in a car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X