బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్: ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం..
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను వెనుక నుంచి వస్తున్న ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications