పేలిన గ్యాస్ సిలిండర్: టెన్షన్.. టెన్షన్...

రాష్ట్రంలో ఎలాంటి పేలుళ్లు జరిగినా నగర వాసులు ఉలిక్కి పడుతున్నారు. అవి బాంబు పేలుళ్లో.. మరే పేలుళ్లో తెలవక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం నార్సింగిలో జరిగిన ఓ ప్రమాదంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నార్సింగ్ ప్రాంతంలో మంగళవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.

స్థానిక టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితులను గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే నార్సింగ్ లో ప్రమాదం జరిగిన హోటల్ వద్ద ఉదయం సమయంలో బాగా ర‌ద్దీగా ఉంటుదని..ప్రమాదం జరిగినప్పడు మాత్రం అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెనుప్ర‌మాదం త‌ప్పిందని స్థానికులు చెబుతున్నారు. అయితే సంఘటన జరిగిన తరువాత స్థానిక ప్రజలు స్పందించిన తీరు మరువలేనదని చెప్పవచ్చు. ఎగసి పడుతున్న మంటలను సైతం కొన్ని నిమాషాల్లోనే వారు అదుపులోకి తీసుకువచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+