Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జడ్జిల సస్పెన్షన్, మోడీకి సెగ: కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, ఢిల్లీలో ధర్నా

హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయవాదులు, జడ్జిల ఆందోళనకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు.

కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు, తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరిగేందుకు ఢిల్లీ కేంద్రంగానే ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. హైకోర్టును విభజించాలని డిమాండ్ చేయడంతో పాటు న్యాయాధికారులు ఆప్షన్ల పైన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇద్దరు న్యాయాధికారులు, తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ రెడ్డి, వరప్రసాద్‌లను హైకోర్టు రిజిస్ట్రార్ సస్పెండ్ చేసింది. జడ్జిల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.

హైకోర్టు విభజన నుంచి మొదలు జడ్జిల నియామకం వరకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. జడ్జిల ఆందోళన, ఇద్దరు జడ్జిల సస్పెన్షన్ పైన కేసీఆర్ తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Two leaders of judges' union suspended in Telangana, KCR to protest in Delhi

మరోవైపు న్యాయాధికారుల నిరసనలను ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ సోమవారం అదనపు జిల్లా జడ్జీ హోదాలో ఉన్న ఇద్దరు న్యాయాధికారులపై సస్పెన్షన్‌ విధించింది. మరొకరి డిప్యుటేషన్‌ను రద్దు చేసింది.

vara

దీనిపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. అన్ని కేడర్‌లలోని న్యాయాధికారులు మంగళవారం నుంచి మూకుమ్మడిగా సెలవుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హైకోర్టు ముందు ఆందోళనకు దిగింది.

సిటీ కోర్టు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ఒకరు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. న్యాయాధికారుల విభజన ప్రక్రియలో భాగంగా గతనెల 3న ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక కేటాయింపుల జాబితాపై కొనసాగుతున్న నిరసనలు సోమవారం మరింత తీవ్రమయ్యాయి.

ravi

ప్రాథమిక కేటాయింపులకు నిరసనగా న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారన్న ఆరోపణపై న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు, నాంపల్లి కోర్టులో 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సంఘం ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) ఉత్తర్వులు జారీ చేశారు.

4వ అదనపు ఎంఎస్‌జె పోస్టు బాధ్యతలను తక్షణం 3వ అదనపు ఎంఎస్‌జెకు అప్పగించాలని రవీందర్‌రెడ్డికి పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా 14వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి బాధ్యతలను 5వ జిల్లా అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జికి అప్పగించాలన్నారు.

image

సంయుక్త కార్యదర్శి ఎం రాధాకృష్ణ డిప్యుటేషన్‌ను రద్దు చేసి ఆయన గతంలో పని చేస్తున్న సైబరాబాద్‌ 24వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌గా వెనక్కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేపరు రహిత కోర్టు ప్రాజెక్టు పనుల నిమిత్తం ఆయన్ను హైకోర్టుకు డిప్యుటేషన్‌పై తీసుకురాగా ప్రస్తుతం దాన్ని రద్దు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+