టీటీడీపీలో మరో రెండు వికెట్లు డౌన్! రాజీనామా యోచనలో ఇద్దరు సీనియర్ నేతలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి రాజీనామా సృష్టించిన ప్రకంపనల ప్రభావం టీటీడీపీని వీడడం లేదు. రేవంత్ రెడ్డి బాటలోనే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

  రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

  తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనుచరులు, ఇతర నేతలతో ఆయన సమావేశమయ్యారు. డిచ్‌పల్లి మండలం ధర్మారంలో మండవ వెంకటేశ్వరరావు ఇంట్లో టీడీపీ నేతల భేటీ జరిగింది.

  mandava-arikela

  దీనికి అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ, తాజాగా అనుచరులు, నేతలతో సమావేశంకావడం చర్చ‌నీయాంశమైంది.

  అరికెల నర్సారెడ్డి కూడా పార్టీ మారుతారని, గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరుకున్న తరుణంలో మండవ నిర్వహించిన భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Two more TTDP Leaders are planning to submitt their resignations to the TDP Chief Chandrababu Naidu it seems. According to the sources, Former Minister Mandava Venkateswara Rao and Arikela Narsa Reddy also going to resign to TTDP. Mandava already conducted a meeting in his house with his followers, sources said. Former MLA Annapurnamma and Arikela Narsa Reddy attended this meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి