లాటరీ ఫ్రాడ్: నైజీరియన్ల పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: లాటరీ పేరుతో ప్రజలకు టోకరా వేసేందుకు ఇద్దరు నైజీరియన్లు చేసిన పన్నాగాన్ని పోలీసులు వమ్ము చేశారు. ఇందుకు పథకం వేసిన ఇద్దరు నైజీరీయన్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ ఎసిపి జయరాం కథనం ప్రకారం - నైజీరియాకు చెందిన క్రిస్టోఫర్ (31), ఓజియోబీ అమీన్ విక్టర్ (34) అక్రమంగా మూడేళ్ల నుంచి హైదరాబాదు నగరంలో ఉంటున్నారు. వీరిద్దరూ లాటరీలో పేరుతో ప్రజలకు కుచ్చుటోబీ పెట్టేందుకు కుట్ర చేశారు. ఈ క్రమంలోనే మణికొండలో నెల రోజుల క్రితం ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.

అద్దె ఫ్లాట్‌లో రెండు ల్యాప్‌టాప్‌ల ద్వారా లక్ష ఈ మెయిల్ ఐడిలను సంపాదించారు. వారందరికీ మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్, కోకాకోలా బిబిసి, రెడ్ బ్లూ లాటరీలు గెలిచారని మెయిల్స్ పంపించారు. లాటరీ మొత్తం డబ్బు కావాలంటే ట్యాక్స్, ఆర్‌బిఐ అనుమతి కింద కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ డబ్బు తాము చెప్పిన ఖాతాలో వేయాలని మెయిల్స్ పంపించారు.

సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్, ఎస్ఐలు విజయవర్ధన్, మైపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్స్ నైజీరియన్లు అద్దెకు ఉంటున్న ఫ్లాట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. శుక్రవారం వారి ఫ్లాట్‌పై దాడి చేశారు. క్రిస్టోఫర్, ఓజియోబీ అమీన్ విక్టర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications