అల్ప పీడనాలతో భారీవర్షాల హెచ్చరిక చేసిన రెండు సముద్రాలు
ఓవైపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో పాటు, మరోవైపు బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి.
అల్పపీడనాలు .. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడనుందని\ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది క్రమంలో ఇది వాయుగుండంగా తుఫానుగా మారుతుందని పేర్కొంది. అటు బంగాళాఖాతంలో సైతం ఈనెల 27వ తేదీన ఏర్పడే అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఈసారి ముందస్తుగా కేరళ తీరాన్ని తాకడంతో పాటు అల్పపీడనాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ను వర్షాలు పడే అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణాలో ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్,వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది.












Click it and Unblock the Notifications