వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనకు తెలంగాణా స్థానిక ఎన్నికల్లో గుర్తులు ! ఒక్కటి కాదు .. రెండు.. ఎందుకలా .. ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల || Oneindia Telugu

తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప‌రిష‌త్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్నాయ‌ని..ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే మేలు జ‌రుగుతుంద‌ని వారు జనసేనాని ప‌వ‌న్‌ కళ్యాణ్ కు వివరించిన నేపధ్యంలో జనసేన ఉనికి తెలంగాణాలో చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు . ఇక అందులో భాగంగా తెలంగాణ స్థానిక సంస్థ‌ల బ‌రిలో పోటీ చేసే నిర్ణయం తీసుకున్న జనసేనకు ఇప్పుడు గుర్తుల గోల తిప్పలు తెచ్చిపెడుతుంది.

షాకింగ్ ..... ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బస్సు దొంగలు.. బస్సులకు భద్రత కరువు షాకింగ్ ..... ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బస్సు దొంగలు.. బస్సులకు భద్రత కరువు

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు రెండు గుర్తులు ..

పార్టీ పెట్టిన ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసును ఎన్నిక‌ల సింబ‌ల్ గా ఖ‌రారు చేసింది. ఇటీవ‌ల ముగిసిన ఏపీ ఎన్నిక‌ల్లో అదే గుర్తుతో ఆ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేశారు. ఇక తెలంగాణా ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అయింది జనసేన . జనసేన గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ బాగానే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా గాజు గ్లాసు బాగా ప్రచారం అవుతుందన్న తరుణంలో అనూహ్యంగా ఎన్నిక‌ల సంఘం జడ్పీటీసీ ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తును అలాగే ఉంచేసి... ఎంపీటీసీ ఎన్నికలకు క్రికెట్ బ్యాట్ గుర్తును కేటాయించింది .

 జనసేన గుర్తులు ...ఎంపీటీసీ కి క్రికెట్ బ్యాట్ , జడ్పీటీసీకి గాజు గ్లాస్

జనసేన గుర్తులు ...ఎంపీటీసీ కి క్రికెట్ బ్యాట్ , జడ్పీటీసీకి గాజు గ్లాస్

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎంపీటీసీ , జడ్పీటీసీ రెండు ఎన్నిక‌లు ఒకేసారి జ‌రిగినా జ‌న‌సేన‌ పార్టీకి రెండు వేర్వేరు గుర్తులను కేటాయించటం చర్చనీయాంశం అవుతుంది. సాధార‌ణంగా పార్టీ గుర్తుల‌పైనే జరిగే ఈ ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు ఒకే సింబ‌ల్ ను కేటాయిస్తుంటారు. కానీ రెండు గుర్తులు కేటాయించటం ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేని నేప‌థ్యంలో త‌న‌కు కేటాయించిన గుర్తుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు జ‌న‌సేన తిప్పలు పడుతుంది.

రెండు గుర్తుల ప్రచారంలో జనసేన తిప్పలు

రెండు గుర్తుల ప్రచారంలో జనసేన తిప్పలు


ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసి తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి రెండు గుర్తులు కేటాయించార‌ని, ఇందులో ఇప్ప‌టికే త‌మ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసును జ‌డ్పీటీసీ అభ్య‌ర్థుల‌కు, కొత్త‌గా కేటాయించిన క్రికెట్ బ్యాట్ గుర్తు ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌కు అని ఈ విష‌యాన్ని అందరూ గుర్తించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది.

English summary
The Jana Sena Party is now getting ready for the local body elections in Telangana. The party, which had faced its first election on April 11, is now gearing up its ranks for the local body elections across Telangana .The party had completed the first round of consultations with the local leadership and had decided to contest . the ec gave the two symbols for janasena party for local bosy elections. for MPTC it was cricket bat, for ZPTC the symbol was glass
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X