• search

కికి ఛాలెంజ్‌కు దేశీ టచ్, తెలంగాణ యువకులే విజేతలు!: ఇంటర్నెట్లో అదుర్స్, సెలబ్రిటీల ప్రశంస

By Srinivas
Subscribe to Oneindia Telugu
For hyderabad Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
hyderabad News
   ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్న తెలంగాణ యువకుల కికి ఛాలెంజ్‌

   హైదరాబాద్: ఇటీవల ప్రమాదకర కికి ఛాలెంజ్ యువతను వెర్రెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కికి ఛాలెంజ్ ఎంతో ప్రమాదకరం కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కెనడాకు చెందిన కికి ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతుంటే తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సరికొత్త కికి ఛాలెంజ్‌తో అదరగొట్టారు. వీరి కికి ఛాలెంజ్ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఎంతోమంది చూస్తున్నారు.

   వెరీ డెంజరస్: కెనడా టు రెజినా: ఏమిటీ కికి ఛాలెంజ్, ఎందుకు ప్రమాదకరం?

   సెలబ్రిటీల అభినందనలు

   సెలబ్రిటీల అభినందనలు

   పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపుతున్నారు. కెనడా నుంచి వచ్చిన కికి ఛాలెంజ్... నడుస్తున్న కారులో నుంచి దిగి రోడ్డుపై డ్యాన్స్ చేయడం. ఇది ప్రమాదకరం. కానీ తెలంగాణకు చెందిన ఈ ఇద్దరు యువకులు చేసిన కికి ఛాలెంజ్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

   మేరా భారత్ మహాన్ వివేక్ ఒబెరాయ్

   ఈ వీడియోలో గీలా అనిల్ కుమార్ (24), పిల్లి తిరుపతి (28)లు పొలంలో కికి దేశీ కికి ఛాలెంజ్ చేశారు. ఈ వీడియోను ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసి, ప్రశంసించారు. నేను ఈ కికి ఛాలెంజ్‌ను మాత్రమే స్వాగతిస్తానని, దేశీ స్టయిల్ కికి ఛాలెంజ్ పూర్తిగా భద్రతతో కూడుకున్నదని, మేర్ భారత్ మహాన్ అంటూ వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు.

    మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్

   మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్

   గీలా అనిల్ కుమార్, పిల్లి తిరుపతి వరినాట్ల సందర్భంగా ఎద్దులతో పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ పాడిన ఇట్స్ మై ఫీలింగ్స్ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. కొంత గాంగ్నమ్ స్టైల్, ఇంకొంత దేశీ డ్యాన్స్ మిక్స్ చేశారు. ఈ వీడియోను దర్శకులు శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్లో ఈ నెల 1న పోస్ట్ చేశారు. దీనిని కోట్లాది మంది చూశారు. వివెక్ ఒబెరాయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోను కూడా కోటిన్నర మందికి పైగా చూశారు. ప్రముఖ కెనడియన్ కమేడియన్, టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోవా.. కికి సవాలులో ఈ ఇద్దరు యువకులను విజేతలుగా ప్రకటించారు.

   కొడుకును కికి అని పిలుచుకుంటున్న తిరుపతి

   కొడుకును కికి అని పిలుచుకుంటున్న తిరుపతి

   కికి ఛాలెంజ్ తనకు ఇంత పేరు తీసుకు రావడంతో ఇటీవలే పుట్టిన తన కుమారుడికి తిరుపతి.. కికి అని నామకరణం చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన సమయంలోనే తన కొడుకు 21 చేసుకున్నాడని, దీంతో తన కొడుకును మేమంతా కికి అని పిలుస్తున్నామని తిరుపతి చెప్పాడు.

   ఫోన్ కాల్స్ వస్తున్నాయి

   ఫోన్ కాల్స్ వస్తున్నాయి

   గీలా అనిల్ తల్లిదండ్రులు నిర్మల, మల్లేషం. వీరు ఫామ్ లేబర్లు. లంబాడిపల్లి దాడి తమ కొడుకుకు ఇంత పేరు రావడంపై ఆ తల్లిదండ్రులు అబ్బురపడిపోయారు. తన తల్లిదండ్రులకు ఇంటర్నెట్, దాని ఉపయోగం, సోషల్ మీడియా గురించి తెలియదని, తమకు ఇలా ఇంటర్నెట్ ద్వారా ఇలా పేరు రావడానికి గల కారణం తన తల్లిదండ్రులకు చెప్పడానికి సమయం తీసుకుంటుందని, తన తల్లిదండ్రులకు, తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

   మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   People around the world have attempted the kiki challenge which involves dancing alongside it to Drake’s hit “In My Feelings” but it’s two Telangana farmers who’ve won over the internet.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more