త్వరలో తెలంగాణలో మహిళా మంత్రులు ?
హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లభించనుంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈసారైనా మహిళలకు క్యాబినెట్ లోకి తీసుకోవాలని కోరారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేసీఆర్ .. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో అతివలకు అవకాశం దక్కనుంది. తొలి విడుత ప్రభుత్వంలో మహిళలకు ఛాన్స్ లభించకపోవడంతో .. ఈ సారి ఇద్దరికీ ఇస్తామని స్పష్టంచేశారు కేసీఆర్.
రేసులో ఎవరు ?
సభలో సీఎం సమాధానంతో ఎవరికీ బెర్త్ దక్కుతుందో అన్న చర్చ మొదలైంది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గుండు సుధారాణి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోన్నాయి. వీరితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి కూడా అవకాశం ఇస్తామని కేసీఆర్ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications