మహిళా తోడు దొంగలు వీరే: ఒకరు హోం గార్డు భార్య (ఫొటోలు)
హైదరాబాద్: ఓ ఏసీని దొంగిలించిన కేసులో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ హోంగార్డు భార్య కావడం విశేషం. జూబ్లీహిల్స్ అదనపు ఇన్‌ప్పెక్టర్ ముత్తు, డీఎస్సై కె. రమేష్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లా పోడూరు గ్రామానికి చెందిన అలగితోలు కలమ్మ(22) బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్ దుర్గాభవానీనగర్ బస్తీలో నివసిస్తోంది. కలమ్మ భర్త గద్వాల్ పవన్ అంబర్‌పేటలోని హోంగార్డు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు.

కలమ్మకు అదే బస్తీకి చెందిన సాంతలర్ అశ్వినీ(20)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఈ నెల 16న జూబ్లీహిల్స్ రోడ్డు నం. 36లోని ప్లాట్ నం. 733లో పెట్టిన ఒక ఎయిర్‌కండీషనర్‌ను దొంగిలించుకొని ఆటోలో వేసుకొని వెళ్లారు. దానిని పాత ఇనుప కొట్టులో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని విచారించారు.
విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేసి ఏసీని స్వాధీనం చేశారు. ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా ముత్తు అభినందించారు.












Click it and Unblock the Notifications