Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ లో పదవుల జాతర: నామినేటెడ్ పదవుల్లో యువరక్తం?

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి శకం నవశకాన్ని తలపిస్తోంది. రెండేళ్ల క్రితం 'ముఖ్యమంత్రి'గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు, ఆయన అటు ప్రభుత్వాన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేసుకుంటున్న తీరు అద్వితీయం. కేవలం అధికారాన్ని చెలాయించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేస్తూ.. ఎదురైన ప్రతి ఎన్నికలోనూ విజయకేతనం ఎగురవేయడం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం.

రేవంత్ రెడ్డి సారధ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ తన విజయపరంపర కొనసాగించింది ముఖ్యంగా ఇటీవల 2026 ఫిబ్రవరిలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన భారీ విజయం, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికను పంపింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ప్రజల విశ్వాసం తన వెంటే ఉందని ఆయన మరోసారి నిరూపించారు.

Two Years of Revanth Reddy Rule T-Congress Eyes Clean Sweep in May Local Polls Nominated Posts Filling Up

రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనే పదాన్ని మరచిపోయిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ ఎన్నికల నుండి మొదలుకొని.. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 80 శాతానికి పైగా జనాభా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉండటం రేవంత్ రెడ్డికి అతిపెద్ద బలం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు నాంది అని ఆయన నమ్ముతున్నారు.

53 మందికి ఛైర్మన్ పదవులు..?

ప్రస్తుతం తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2024 జనవరిలో నియమితులైన దాదాపు 34 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం మార్చి 15న ముగియనుంది. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి ఒక విప్లవాత్మక నిర్ణయానికి సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లిన యువ నాయకులకు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలకు ఈ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించే సీనియర్లకు స్థానం కల్పిస్తూనే.. కొత్త ముఖాలను తెరపైకి తేవడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మార్చి 15లోగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని టీపీసీసీకి నిర్దిష్ట గడువు విధించారు. రాష్ట్రంలో మొత్తం 53 కార్పొరేషన్లు ఉండగా ఇప్పటి వరకు 34 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ దఫా 53 మందికి అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు

వ్యూహాత్మక అడుగులు - రాజ్యసభ ఎంపిక..

రాజకీయాల్లో విశ్వసనీయతకు రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రాధాన్యత రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో స్పష్టమైంది. తన నీడలా ఉంటూ, కష్టకాలంలో వెన్నంటి నిలిచిన వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పించడం ద్వారా తన అనుచర వర్గానికి భరోసా ఇచ్చారు. అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గొంతుకను బలోపేతం చేసేందుకు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి పంపడం, ఇటు తన సన్నిహితుడిని ఎంపిక చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠం వద్ద కూడా తన మాటకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

మే నెల లక్ష్యంగా.. స్థానిక పోరు..

మున్సిపల్ ఎన్నికల జోరు తగ్గకముందే, రేవంత్ సర్కారు మే నెలలో జరగబోయే మండల పరిషత్ (MPP), జిల్లా పరిషత్ (ZPP) ఎన్నికలకు సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా, ఏప్రిల్ లోనే బూత్ లెవల్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్ కి తిరుగుండదని సీఎం భావిస్తున్నారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్? ..

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. రేవంత్ రెడ్డికి సరైన జోడిగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రేవంత్.. తన తర్వాత ఆ స్థానాన్ని సమర్థవంతంగా నిర్వహించే వారి కోసం అన్వేషిస్తూన్నారు. వివాదాలకు తావు లేకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ల సూచనలను పరిగణలోకి తీసుకుంటూనే, పార్టీకి విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కేలా రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురి పేర్లు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయి.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో బలరాం నాయక్, రోహిణ్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేలలో ఒకరికి ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు సంపత్ కుమార్ పేర్లు కూడా పరిగణలో ఉన్నట్లు సమాచారం. వంశీచంద్ రెడ్డి కూడా అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతిమంగా సామాజిక సమీకరణాలు కూడా ప్రభావితం చేసే అవకాశం గట్టిగా ఉంది. ఇక అదే బాటలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు (DCC), బ్లాక్ కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణ ద్వారా పార్టీ వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నారు.

99 రోజుల కార్యాచరణ..

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విజయం కేవలం పదవికే పరిమితం కాలేదు. ఫామ్‌హౌస్ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజల మధ్యకు పాలనను తీసుకెళ్లడం ఆయన సాధించిన అతిపెద్ద సక్సెస్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను మార్చి 6న లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో క్యాడర్, లీడర్లు ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా టాస్కులు ఇస్తూనే ఉన్నారు రేవంత్. పార్టీ కార్యకర్తలకు భరోసా, సామాన్యులకు భద్రత, రాజకీయ ప్రత్యర్థులకు సవాల్‌గా నిలుస్తూ రేవంత్ రెడ్డి సాగిస్తున్న ఈ ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసగా రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ రికార్డున సమం చేయాలని తహతహలాడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+