పుణ్యక్షేత్రం జిల్లాగా అక్కర్లేదు: మోత్కుపల్లికి ఉమా మాధవరెడ్డి ఝలక్
హైదరాబాద్: తమ పార్టీ నల్లగొండ జిల్లా నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఝలక్ ఇచ్చారు. యాదగిరిగుట్టును జిల్లాగా చేయాలనే ఆయన డిమాండ్‌ను ఆమె వ్యతిరేకించారు. పుణ్య క్షేత్రాలను జిల్లాగా చేయాల్సిన అవసరం లేదని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు.
కొంత మంది స్వప్రయోజనాల కోసం వారి ప్రాంతాలను జిల్లాలు చేయాలని పట్టుబడుతున్నారని ఆమె పరోక్షంగా మోత్కుపల్లిని ఉద్దేశించి అన్నారు. భువనగిరిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాం కాలంలో భువనగిరి జిల్లాగా ఉందని ఆమె చెప్పారు.

నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్టను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు యాదగిరిగుట్టలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుట్టలోని వైకుంఠ ద్వారం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు.
యాదగిరిగుట్ట గతంలో మోత్కుపల్లి నర్సింహులు ప్రాతినిధ్యం వహించిన ఆలేరు శాసనసభా నియోజకవర్గంలోకి వస్తుంది. కాగా, భువనగిరి శాసనసభా నియోజకవర్గం నుంచి ఉమా మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. నల్లగొండ జిల్లా టిడిపిలో వీరిద్దరు వైరి వర్గాలుగా కొనసాగుతున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications