Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ పనైపోయిందని తెలుసు, రేవంత్ వెంటే వెళ్లేదాన్ని: బాబుకు ఉమామాధవరెడ్డి షాక్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీడీపీ నాయకురాలే ఆ మాటలు మాట్లాడటం ఇప్పుడు

Recommended Video

    Umamahdava Reddy hot comments on TDP టీడీపీ పని అయిపోయింది ?

    భువనగిరి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీడీపీ నాయకురాలే ఆ మాటలు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఆమె స్పందించారు. టీడీపీ పని తెలంగాణలో అయిపోయిందని, అయితే ఎలాంటి హామీ లేకుండా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పిచ్చిదానినా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

    అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు

    అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు

    నక్సలైట్ల చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్ పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు.

     సండ్ర ఉండగానే కేసీఆర్‌ను కలిశా

    సండ్ర ఉండగానే కేసీఆర్‌ను కలిశా

    సీఎంను ఒంటరిగా కలిస్తే తెరాసలో చేరే విషయం ప్రచారం జరుగుతోందని, అందుకే తాను సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వెళ్లానని ఉమామాధవ రెడ్డి చెప్పారు. అందరూ ఉండగానే సీఎంకు వినతిపత్రం ఇచ్చానని చెప్పారు.

     రేవంత్ రెడ్డికి హామీ వచ్చిందేమో

    రేవంత్ రెడ్డికి హామీ వచ్చిందేమో

    కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పదవులపై కాంగ్రెస్ హామీ ఇచ్చి ఉండవచ్చునని ఆమె చెప్పారు. లేదంటే తనతో మీ మాట్లాడకుంటా ఆ పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. తనకు కూడా హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తో పాటే ఢిల్లీకి వెళ్లేదాన్నని చెప్పారు.

     తెరాసలో చేరమని అప్పుడు చెప్పారు కానీ

    తెరాసలో చేరమని అప్పుడు చెప్పారు కానీ

    గత ఎన్నికల సమయంలో తెరాసలో చేరమని ఆహ్వానం వచ్చిందని ఉమా మాధవ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తాను పార్టీలో చేరలేదన్నారు. ప్రస్తుతం తనను ఎవరూ అడగలేదన్నారు. అడిగితే ఆలోచిస్తానని తేల్చి చెప్పారు.

    లోకసభకు పోటీ చేయడంపై

    లోకసభకు పోటీ చేయడంపై

    తాను ఏ పార్టీలో చేరిన తన కుమారుడి వెంటే ఉంటానని ఉమా చెప్పారు. తెరాసలో చేరి భువనగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తారా అని అడిగితే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ ఎక్కడకు వెళ్తారని ఆమె ప్రశ్నించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+