ఫ్లై ఓవర్‌పై నుంచి పడి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట ఫ్లైవోర్ పై నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు జనసంచారం మధ్యే పంచనామా నిర్వహించారు. ప్రమాదం జరిగిందా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు.
దోపడీ ముఠా పట్టివేత
హైదరాబాద్ నగరంలో పలువురు దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం దొంగల ముఠాను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
నాలుగో తరగతి విద్యార్థి హత్య
ఖమ్మం జిల్లాలోని లెనిన్ నగరంలో నాలుగో తరగతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. జీపీఎస్ స్కూళ్లో నాలుగో తరగతి చదువుతున్న సంతోష్‌ను గుర్తుతెలియని దుండగులు గొంతునులిమి హత్య చేశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని రూరల్ మండలం కరుణగిరి దగ్గర ముళ్లపొదల్లో పడేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
టిడిపి ధర్నా
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఎదుట ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం ఆందోళనకు దిగారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, రావుల, విజయరమణారావు, ఇతల జిల్లాల నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ధర్నాలు పాల్గొన్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.












Click it and Unblock the Notifications