తెలంగాణాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు; కారణమిదే!!
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించాలని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాస్త నిరాశలో ఉన్న బీజేపీ శ్రేణులలో జోష్ పెంచాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపటి పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయిందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం, మహబూబ్నగర్, కరీంనగర్ హైదరాబాద్ లలో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలని బిజెపి భావించింది.

ఈ సమావేశాలలో అమిత్ షా పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించింది. అయితే బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి బిజెపి వైపు దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.
బిజెపి అగ్ర నాయకుల పర్యటనలు రద్దు కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక సందర్భాలలో బిజెపి అగ్ర నాయకుల పర్యటనలు, ముఖ్యంగా అమిత్ షా పర్యటనలు రద్దయ్యాయి. ఇక ఇప్పుడు కూడా మరో మారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి పర్యటన రద్దయింది. మళ్ళీ ఎప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉండబోతుంది అనేది త్వరలోనే వెల్లడిస్తామని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంపై లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటన రద్దు కావటంతో ఇప్పటికే ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు సంపాదించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న క్రమంలో బీజేపీ తెలంగాణాలో వేసే తొలి అడుగే వాయిదా పడింది.












Click it and Unblock the Notifications