ఈటల సర్జికల్ స్ట్రైక్‌తో కేసీఆర్ మతి చెడింది.. పిచ్చి ప్రేలాపనలు ఆపకపోతే ? : బీజేపీ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. పుల్వామా దాడి వార్షికోత్సవ జరుపుకుంటున్న సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు స‌ర్జిక‌ల్ స్ట్రైక్

హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఆవేశం, ఆందోళన నెలకొందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్లు విసిరారు. తన పతనం మొదలైందని ఆయనలో కోపం ఎక్కువ వస్తుందని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికలో ఓడిపోతేనే పరిస్థితి ఇలా ఉందంటే.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లు అర్థం అవుతుందని విమర్శించారు . దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న జవాన్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

పాకిస్తాన్ మాటల్లాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటలు

కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటలు పాకిస్తాన్ మాటల్లాగే ఉన్నాయని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. వీళ్లు ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారని చురకలు అంటించారు. హిజాబ్ , సర్జికల్ స్టైక్‌పై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంలో బీజేపీతో పోటీ పడలేక ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్‌ను ప్రశ్నించడం ద్వారా కేసీఆర్ మనస్తత్వం ఏమిటో తెలియజేస్తోందని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మతి చెడింది..

కేసీఆర్ మతి చెడింది..

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఆయనకు మతి చెడిందని విమర్శలు గుప్పించారు. ఈటల చూపించిన దెబ్బకు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి.. ప్రధాని మోదీపై, బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎన్నికల జిమ్మిక్కులు ప్రజలు నమ్మరని దుయ్యబట్టారు. ఎక్కడ తన పీఠం కదులుతుందో అన్న భయం కేసీఆర్‌లో పట్టుకుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై పిచ్చి ప్రేలాపన మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+