ఫీజులు కట్టి వారికి మోదీ గిఫ్ట్ ఇచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ గిఫ్ట్ గా సైకిల్స్ ని పంపిణీ చేశారు. బండి సంజయ్ తన పుట్టిన రోజుకి రెండు రోజుల ముందు 20,000 సైకిళ్లను పంపిణీ చేశారు.
టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించిన బండి సంజయ్
విద్య కోసం పెద్దపీట వేస్తుందని 1. 28లక్షల కోట్ల కేటాయించిందని పేర్కొన్న బండి సంజయ్ తాజాగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరికీ మరో శుభవార్త చెప్పారు. మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు కరీంనగర్ జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.5,45, 375 మొత్తాన్ని చెల్లించారు.

కలెక్టర్ కు చెక్కు అందజేత
ఈ మేరకు కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, నాయకులు గుజ్జు శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ ను కలిసి పరీక్షా ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
టెన్త్ విద్యార్థుల ఫీజు చెల్లిస్తానని కలెక్టర్ కు బండి సంజయ్ లేఖ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికి ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకొని, ఆమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారని తెలిపారు.
తన వేతనం నుండి ఎగ్జామ్ ఫీజు చెల్లించిన బండి సంజయ్
అధికార వర్గాలు తెలియజేసిన ప్రకారం కరీంనగర్ జిల్లాలో 4,847, మంది 10వ తరగతి విద్యార్థులున్నారనీ, వీరందరికీ పరీక్ష ఫీజు కోసం కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ తన వేతన డబ్బులు నుండి రూ.5,45, 375 ల మొత్తాన్ని చెల్లించడం జరిగిందని అన్నారు. బండి సంజయ్ కుమార్ అందజేసిన మొత్తాన్ని చెక్ రూపంలో జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు తెలిపారు.
మోదీ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు సహకారం
ముఖ్యంగా విద్యార్థులకు అందమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే తాను కూడా మోదీ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు సహకారం అందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని, ప్రస్తుతం తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకుని జీవించే అవకాశం ఉంటుందని బండి సంజయ్ విద్యార్థులను ఉద్దేశించి అనేకమార్లు పేర్కొన్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications