మన పిల్లలైతే ఇలాగే చేస్తామా?: బండి సంజయ్ సీరియస్

కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని చెబుతున్నారని, మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా? అని ప్రశ్నించారు. టాయిలెట్‌​లో నీళ్లు రాకపోతే పట్టించుకోరా? అని నిలదీశారు. మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నానని, రెండోసారి వచ్చిన సమయంలో ఇలా ఉండకూడదని కేంద్రమంత్రి హెచ్చరించారు.

Union Minister Bandi Sanjay visited Marimadla Ekalavya School

అనంతరం టాయిలెట్ల నిర్మాణానికి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ తన పరిధిలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. 2018-19లో దేశవ్యాప్తంగా బ్లాక్‌​ల వారీగా 50 శాతం ఎక్కువ ఉన్న ఆదివాసీ గిరిజన ఎస్సీ, ఎస్టీ బ్లాకుల్లో ఏకలవ్య పాఠశాలను కేంద్రం మంజూరు చేయాలని నిర్ణయించిందన్నారు.

Union Minister Bandi Sanjay visited Marimadla Ekalavya School

2022లో 20 శాతం జనాభా ఉన్న బ్లాకుల్లో కూడా ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 728 పాఠశాలను ప్రారంభించిందన్నారు. ఇప్పటివరకు 410 పాఠశాలల్లో విద్యా బోధన కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్​ పాఠశాలల్లో 1.20 లక్షలకు పైగా మంది విద్యార్థులు చదువుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. పాఠశాలల భవన నిర్మాణానికి రూ.38 కోట్లు వెచ్చిస్తుండగా, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.48 కోట్లను కేటాయించినట్లు వివరించారు.

తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలల్లో 8,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్లలోని ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు. ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు, సూచనలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+