Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలుపై కేంద్రమంత్రి సూపర్ న్యూస్!

తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆలయ నిర్మాణం జరిగినప్పటినుంచి ఇప్పటివరకు నిత్యం వేలాదిమంది భక్తులు యాదగిరిగుట్ట స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఎంఎంటీఎస్ రైలుసర్వీస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు నిత్యం ప్రయాణం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నుండి నిత్యం యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు ప్రారంభించాలని భక్తులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఈ తాజా డిమాండ్ పైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. భక్తుల కోరికను మన్నించి త్వరలోనే కేంద్రం ఆ అవకాశం కల్పించబోతుంది అంటూ శుభవార్త చెప్పారు.

Union Minister Kishan Reddy said good news about proposed Hyderabad Yadagirigutta MMTS train

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంఎంటిఎస్ మూడోదశ నిర్మాణ పనులు

హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ మూడో దశ నిర్మాణ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఘట్కేసర్ నుండి రాయగిరి స్టేషన్ వరకు ఈ ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 50 నిమిషాలలోనే హైదరాబాద్ నుండి యాదగిరి గుట్టకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

తక్కువ ఖర్చుతోనే యాదగిరిగుట్టకు

అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట కు ప్రయాణం చేసే వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రయాణానికి ధర కేవలం 15 రూపాయల నుంచి 20 రూపాయలు మాత్రమే ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం యాదగిరిగుట్టకు వెళ్లాలనుకున్న భక్తులు కార్లు, ప్రైవేట్ వాహనాలు, బస్సుల ద్వారా యాదగిరిగుట్టకు ప్రయాణం చేస్తున్నారు.

భక్తులకు శుభవార్త చెప్పిన కిషన్ రెడ్డి

దీంతో వీరి ప్రయాణ సమయం వృధా అవ్వడమే కాకుండా, డబ్బు కూడా వృధా అవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు సర్వీసును ప్రారంభించాలని భక్తులు కోరుతున్న క్రమంలో వారందరి విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇదిలా ఉంటే త్వరలోనే కొమురవెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తామని కూడా కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+