తెలంగాణ నుంచి ఏపీకి ఎలా?: కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అబద్ధాలతో పార్లమెంటును తప్పుదోవ పట్టించారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బల్క్ డ్రగ్స్ పార్కును ఏపీకి రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.
పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపర్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ హబ్‌కు బల్క్ డ్రగ్ పార్కకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారన్నారు. జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని మండిపడ్డారు.

అబద్ధాలతో పార్లమెంటును తప్పుదోవ పట్టించిన ఈ కేంద్రమంత్రిపై లోక్‌సభలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
లోక్‌సభ సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి మాండవీయ.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్స్ పార్క్‌లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇందుకు రూ.1,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, తొలి విడతలో ఒక్కొక్కదానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్‌సభలో మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
The Minister had not only misled the people of Telangana with his white lies but also the August house; Indian parliament
— KTR (@KTRTRS) December 17, 2022
Request @BRSparty Floor leader in Loksabha Sri @MPnama Garu to move a privilege motion and make sure he apologises to people of Telangana for misleading
అయితే, లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బల్క్‌డ్రగ్ పార్క్‌ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కేంద్రం వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications