కేసీఆర్ ను, కవితను టార్గెట్ చేస్తున్న కేంద్రమంత్రులు!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. బీజేపీని గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం బిజెపికి కూడా చావో రేవో అన్నట్టుగా మారడంతో జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తాజాగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అశ్వినీ చౌబే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కవితలను టార్గెట్ చేశారు.

అవినీతికి వ్యతిరేకంగా బిజెపిని గెలిపించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనీ కేంద్ర యువజన,క్రీడా శాఖామాత్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Union ministers targeting KCR and Kavitha, and asks people to defeat brs

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మునుగోడు గడ్డమీద భారీ మెజార్టీతో బిజెపి గెలుస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో BRS మరియుBjp కి మధ్య మాత్రమే పోటీ ఉందని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి కల సాకారం అవుతుందని, అందుకే బీసీ లు అంతా ఏకం అయ్యి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అశ్విని చౌబే హన్మకొండలో పర్యటించారు. హంటర్ రోడ్ లో మీడియా సెంటర్ ను ప్రారంభించిన ఆయన కేసీఆర్ ను, కవితను టార్గెట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తామంటూ కేంద్ర మంత్రి అశ్విని చోబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్లు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, బీజేపీని ఎదుర్కోలేక రెండూ ఏకం అయ్యాయని అన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+