Cadbury dairy milk: ఈ చాక్లెట్లు తింటే ఆరోగ్యం అంతే సంగతులు!

హైదరాబాద్: పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఆరగించే క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ప్రియులకు ఇది చేదువార్తే. ఎందుకంటే.. క్యాడ్‌బరీ చాక్లేట్లు తినేందుకు అంత సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ (SFL) స్పష్టం చేసింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొని తిందామనుకున్న సమయంలో ఆ చాక్లెట్లో ఓ పురుగు సజీవంగా కనిపించింది. దీంతో అతడు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్‌లో ఈ ఘటన ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ చాక్లెట్ కొన్న వినియోగదారుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో సజీవ పురుగు కనిపించింది. చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులోకి మారుతోందంటూ వినియోగదారులు ఆందోళనకు గురయ్యాడు.

Unsafe To Consume, says Telangana SFL After Detecting Worms In Cadburys Roasted Almond Chocolates

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సామాజిక కార్యకర్త రాబిన్ జాచ్యూస్ ఎక్స్(ట్విట్టర్)లో ఈ మేరకు పోస్టు చేసి వ్యాఖ్యానించాడు. అమర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని పేర్కొన్నారు.

డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై క్యాడ్‌బరీ.. సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ నిలదీశారు. గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్, క్యాడ్‌బరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేశాడు. తాను కొనుగోలు చేసిన బిల్లును కూడా ఈ పోస్టుకు జతచేశారు.

ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేపట్టిన తెలంగాణ ఎస్ఎఫ్ఎల్ అధికారులు ఆ చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్‌లో పరీక్షలు చేసిన అధికారులు.. అందులో తెల్లని పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్స్ చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి సురక్షితంగా కాదని నిర్ధారించిందారు. క్యాడ్ బరీ చాక్లెట్లు తినకూడదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+