ప్రపంచాన్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?: ఉపాసన (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ పెడిట్రీషియన్ డాక్టర్ అనుపమ్ సిబాల్ పిల్లల పెంపకంపై రాసిన 'ఈజ్ యువర్ చైల్డ్ రెడీ టు ఫేస్ ది వరల్డ్' పుస్తకాన్ని శ్రీమతి ఉపాసన కామినేని శనివారం నాడు లెమన్ ట్రీ ప్రీమీయర్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం పెంగ్విన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రచురితమైంది.

'పిల్లల ఆలోచనలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేటి తరం పిల్లల యొక్క నడవడికను ఏవిధంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవచ్చు అనేది ఈ పుస్తకం యొక్క సారాంశమ'ని ఉపాసన కామినేని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనుపమ్ సిబాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్ల ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటారని, అదేవిధంగా పిల్లలు తమ కలలను సాకారం చేసుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోగలరనే అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

 ఉపాసన కామినేని

ఉపాసన కామినేని

డాక్టర్ అనుబమ్ సిబాల్ పెడిట్రీషియన్‌గా తనకు ఉన్న అనుభవంతో పిల్లల యొక్క మనస్తత్వాలను, తల్లిదండ్రుల ఆలోచన విధానాలను జోడించి ఈ పుస్తకాన్ని రాశారు.

ఉపాసన కామినేని

ఉపాసన కామినేని

అమితాబ్ బచ్చన్ ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. 'ఎవర్ సో రేర్లీ, యూ కమ్ అప్ ఆన్ ఎ బుక్ దట్ ఈజ్ టైమ్ లెస్' అని ఆయన ఈ పుస్తకానికి ముందుమాటగా రాశారు.

ఉపాసన కామినేని

ఉపాసన కామినేని

డాక్టర్ అనుపమ్ సిబాల్ తాను రాసిన ఈ అద్భుతమైన పుస్తకానికి గాను ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు అందాయి.

 ఉపాసన కామినేని

ఉపాసన కామినేని

ఈ పుస్తకానికి మాధురి దీక్షిత్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కపిల్ దేవ్, బ్రహ్మకుమారి సిస్టర్ శివాని తదితర ప్రముఖుల అభినందనలు దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+