నేటి అసెంబ్లీలో బీఆర్ఎస్‌ Vs కాంగ్రెస్: ఆ అంశంపై అధికార పక్షం రె‘ఢీ’

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీటిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచి పెట్టిందో అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం ప్రజాభవన్​‌లో నీటిపారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది.

ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల ఒప్పందాలు, ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా ఎంత ఉండాలి? తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో సోమవారం తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవాలని చూశారని ఆరోపించారు.

uttam kumar powerpoint presentation on telangana irrigation projects: Congress MLAs fires at brs

సీఎం జగన్‌తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా జలాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడతామన్నారు. జగన్, కేసీఆర్‌లు మాట్లాడుకున్న తర్వాతే.. నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారని విమర్శించారు. కేసీఆర్ చర్యల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, సోమవారం శాసనసభ సమావేశంలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో జరిగిన లోపాలు, చేసిన పనులు లక్ష్యంగా ఈ ప్రజెంటేషన్‌ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యుహంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి దిశా నిర్థేశం చేశారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో, నేటి అసెంబ్లీ సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు హాజరైతే సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+