‘కేసీఆర్! దమ్ముందా? కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బెంటే చూపిస్తాం’: ఉత్తమ్, కోమటిరెడ్డి సవాల్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి, సంపత్‌ల వద్దకు వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

  కేసీఆర్ పై కాంగ్రెస్ తిరుగుబాటు మొదలు

  మరో ఇద్దరి సభ్యత్వాలు రద్దా? ఈ రోజే సంచలన ప్రకటన: తేల్చేసిన కోమటిరెడ్డి

  కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ అసలు ఛైర్మన్ స్వామి గౌడ్‌కి తాకిందా? అని ప్రశ్నించారు. హెడ్ ఫోన్ విసిరిన గంట వరకు గానీ ఆయన కంటికి దెబ్బ తగిలిందని ఎవరికీ తెలియలేదని అన్నారు. అంతేగాక, సీఎం కేసీఆర్ చెబితేనే తాను సరోజనీ దేవి ఆస్పత్రికి వెళ్లానని స్వామిగౌడ్ చెప్పారని అన్నారు.

  అహంకార పూరితంగా కేసీఆర్

  అహంకార పూరితంగా కేసీఆర్

  కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తమ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సభ, మండలి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఐదు నిమిషాల్లోనే అందర్నీ సస్పెండ్ చేశారని అన్నారు.

  కాగా, గురువారం సాయంత్రం వరకు ఎమ్మెల్యేల దీక్ష కొనసాగుతుందని చెప్పారు.
  ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష చేసుకుంటున్నామని.. అయితే, దీక్షకు మద్దతు పలికేందుకు జిల్లాల నుంచి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను కేసీఆర్ సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకుని, అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

  మూల్యం చెల్లించుకోక తప్పదు?

  మూల్యం చెల్లించుకోక తప్పదు?

  కేసీఆర్ సర్కారు తప్పనిసరిగా దీనంతటికి మూల్యం చెల్లించుకుంటుందని ఉత్తమ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల దీక్షకు మద్దతుగా అందరం ఇక్కడే కూర్చుంటామని చెప్పారు. అసెంబ్లీ వ్యవహారాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తుతామని అన్నారు. ఎంపీ కవిత స్పీకర్ ముందు ప్లకార్డులు చూపితే తప్పు లేదు కానీ.. మేం అసెంబ్లీ నిరసన తెలిపితే తప్పా అని ఉత్తమ్ ప్రశ్నించారు. మెజార్టీ ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలను అసెంబ్లీ నుంచి పోలీసులను పెట్టి బయటికి పంపించారని అన్నారు. ఇలాగైతే సభలు ఎందుకని ప్రశ్నించారు.

   కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బెంటో..

  కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బెంటో..

  మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజల్లోకి రావాలని.. దమ్మూ ధైర్యం ఉంటే ఓయూలో మీటింగ్ పెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బంటే.. కాంగ్రెస్ దెబ్బంటే రుచి చూపిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. కాగా, అసెంబ్లీలో హెడ్ విసిరిన కీలక వీడియో ఫుటేజీ ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు స్పీకర్ ను కోరారు. ఈ మేరకు లేఖ రాశారు.

   దొరల రాజ్యామా?

  దొరల రాజ్యామా?

  ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక దొరల రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. దమ్ముంటే తమను అరెస్ట్ చేయాలంటూ కేసీఆర్ కు షబ్బీర్ సవాల్ విసిరారు. కోదండరాం, మందకృష్ణ మాదిగను వారింట్లో కూడా కూర్చోనివ్వడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ కార్యాలయంలో దీక్ష చేసుకున్నా.. కేసీఆర్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.

   నిజాం కంటే ఎక్కువే

  నిజాం కంటే ఎక్కువే

  సీపీఐ నారాయణ కూడా కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు. ఆందోళనలకు అనుమితివ్వరా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు నిజాం నిరంకుశ పాలన కంటే ఎక్కువగా ఉందని అన్నారు. అయితే, కోమటిరెడ్డి హెచ్ ఫోన్ విసిరడం తప్పని నారాయణ అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leaders Uttam Kumar Reddy and Komatireddy Rajagopla Reddy fired at Telangana CM K Chandrasekhar Rao.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి