12 గంటలకు పెద్దమ్మ గుడికి రా.. గ్లోబరీనా తెలీదని అమ్మవారిపై ప్రమాణం చెయ్ ... కేటీఆర్ కు వీహెచ్ సవాల్

Recommended Video

    పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పు... గ్లోబరీనా తెలీదని... KTR కు VH సవాల్..!! || Oneindia Telugu

    తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి. కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలీదన్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్ .

     పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పు ... గ్లోబరీనా తెలీదని .. కేటీఆర్ కు సవాల్

    పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పు ... గ్లోబరీనా తెలీదని .. కేటీఆర్ కు సవాల్

    తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకల కారణంగా నేటికి 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు.ఈ 23 మంది పిల్లలు చనిపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆరే కారణమని ఆయన ఆరోపించారు. తాను ఇంతవరకు గ్లోబరీనా పేరే వినలేదని కేటీఆర్ చెప్పడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. గ్లోబరీనా కంపెనీ పేరు వినలేదని కేటీఆర్ చెప్పడం కచ్చితంగా పచ్చి అబద్ధమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేసి గ్లోబరినా తనకు తెలియదని చెప్పాలని సవాల్ విసిరారు.

    మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రా ..అమ్మవారిపై ప్రమాణం చెయ్ .,అన్న వీహెచ్

    మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రా ..అమ్మవారిపై ప్రమాణం చెయ్ .,అన్న వీహెచ్

    "కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడికి రావాలి, అక్కడికొచ్చి అమ్మవారిపై ప్రమాణం చేయాలి, ఆ విధంగా చేయలేకపోతే కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థతో ఒప్పందం ఉన్నమాట నిజమే అని ఒప్పుకున్నట్టే" అని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు గ్లోబరీనా తెలియదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు వీహెచ్ .

    విపక్షాల ముప్పేట దాడి .. అయినా గ్లోబరీనాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం

    విపక్షాల ముప్పేట దాడి .. అయినా గ్లోబరీనాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం

    గ్లోబరీనా సంస్థ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుందని, ఇంతమంది మరణాలకు కారణం అయ్యిందని, గ్లోబరీనా సంస్థ తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందని గ్లోబరీనా సంస్థ నిర్వాకంపై త్రి సభ్య కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటి వరకు ఆ సంస్థపై ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో కేటీఆర్ గ్లోబరీనా అనే సంస్థ గురించి తనకు తెలీదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్లోబరీనా విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ , గ్లోబరీనాకు , కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏంటి అంటూ విపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. ఇక వీహెచ్ వంటి నాయకులు ఏకంగా కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+