కేసీఆర్ ఓ నియంత: వీహెచ్, విపక్షాల మొసలి కన్నీరు: ఎమ్మెల్సీ కర్నె
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఓ నియంత అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి. హనుమంతురావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ చేస్తోన్న ఆందోళలను మరింత ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. మోడీ, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టివిక్రమార్కలతోపాటు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ ఆలీ శనివారం మాట్లాడుతూ వ్యవసాయ శాఖమంత్రి ఇప్పటి వరకు ఎంత మంది రైతు కుటుంబాలను పరామర్శించారని నిలదీశారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం కుంభకర్ణుడిలా వ్యవహరిస్తోందన్నారు.
ఇంతమంది రైతులు చనిపోయాక ప్రభుత్వం నిద్రలేచిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో రాష్ట్రంలో 1127మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్‌లు నమోదయ్యాయని వివరించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పరచి రైతు సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయలేదన్నారు.
విపక్షాల మొసలి కన్నీరు : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలే కారణమన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రూ. 17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన ఘనత తమ సర్కార్ దేనన్నారు. రైతులు గురించి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
రైతు ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్న 46 చెరువులను కేసీఆర్ హయాంలో పునరుద్ధరించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కేసీఆర్ కృషి చేస్తున్నారని కర్నె ప్రభాకర్ అన్నారు.
రైతు ఆత్మహత్యలపై హరీశ్ మాటలు దారణం: రావుల
రైతుల ఆత్మహత్యలపై మంత్రి హరీశ్ రావు మాటల దారుణంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం ఆపహాస్యం చేస్తోందని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని ఎద్దేవా చేశారు. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికే మంత్రులు కష్టపడుతున్నారని ఆరోపించారు. రైతు రుణాలపై మారటోరియం విధించాలని రావుల డిమాండ్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications