అమెరికాలో విద్యార్థి హత్య: శవం తరలింపులో జాప్యం, పేరెంట్స్ కన్నీరు

అమెరికాలో కాల్పుల్లో మరణించిన తెలంగాణ విద్యార్థి వంశీ మృతదేహాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వంశీ కుటుంబానికి పోలీసులు సహకరిస్తున్నారు.

వరంగల్‌ : అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన వంశీ చందర్ రెడ్డి దుండగుడి కాల్పుల్లో దుర్మరణం చెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు కమిషనర్‌ జి. సుధీర్‌బాబు ఆదేశాలల మేరకు కాజీపేట ఏస్పీ జనార్ధన్‌, హసన్‌పర్తి సీఐ పుల్యాల కిషన్‌ సిబ్బందితో హుాహుిన వంగపహాడ్‌ గ్రామానికి బయలు దేరారు.

మృతుడి తల్లిదండ్రులు సంజీవరెడ్డి, రమాదేవిలతో పాటు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. వంశీరెడ్డి స్నేహితుల ఫోన్‌ల నుంచి వచ్చే ప్రతీ సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ సహకరించారు. అదేవిధంగా సీపీ సుధీర్‌బాబు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఆయన స్నేహితులకు, బంధువులకు ఫోన్‌ చేస్తూ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపించే ఏర్పాటు చేయాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

వంశీరెడ్డి అమెరికాలో దురదృష్టవశాత్తు మృత్యువు పాలు కావడం చాలా బాధాకరం. సంఘటన గురించి తెలియగానే అమెరికా కాన్సుల్‌ె అధికారులతో తాను మాట్లాడినట్లు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి చెప్పారు. ఎలాంటి సాంకేతిక సమస్యులు ఉన్నప్పటికీ వెంటనే పరిష్కరించి మృతదేహాన్ని అప్పగించాలని కోరామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారని అన్నారు వంశీ మృతదేహం రప్పించడానికి అవసరమైన అన్ని పనులను చేస్తున్నామని, ఆ కుటుంబానికి అండగా నిలబడుతామని అన్నారు.

సుష్మా స్వరాజ్ స్పందన

వంశీ చంద్ రెడ్డి మృతి పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆయన మృతదేహాన్ని భారత్ తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మృతి బాధాకరమన్నారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామన్నారు. వంశీరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

{photo-feature}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+