వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సహారా కేసులో కెసిఆర్ రూ.1250 కోట్ల అక్రమాలు, కవితకు 100 ఎకరాలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

గజ్వెల్: సహారా కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.1250 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ అక్రమార్జనతోనే ఫాంహౌస్ భూములను కొనుగోలు చేశారని, పత్రికను కొని, టీవీ ఛానల్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో ఆయన కూతురు కవిత 100 ఎఖరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. 1981లో కెసిఆర్‌కు ఉన్న ఆస్తులపై, నేటి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.

K Chandrasekhar Rao

త్వరలో సిఎం కెసిఆర్ కుటుంబ అక్రమ ఆస్తుల చిట్టా విప్పుతానని చెప్పారు. సహారా కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కెసిఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐకి సహకరించి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.

ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సహారా కేసులో ఇప్పటి వరకు కెసిఆర్ నోరు విప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజాలు బయటపెట్టాలన్నారు.

English summary
TDP leader Vanteru Pratap Reddy lashes out at CM KCR.ం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X