సచివాలయానికి వాస్తుదోషం.. బాహుబలి గేటుపై రేవంత్ సంచలన నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్లపాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో తెలంగాణ సెక్రటేరియట్ ను నిర్మించింది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు దోషాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తాజాగా తెలుస్తోంది.
తెలంగాణా సచివాలయంలో వాస్తు మార్పులు
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వాస్తు ప్రకారం మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయం ప్రధాన మహాద్వారం ఈశాన్యం వైపుకు మార్చడంతో పాటు, అలాగే ఆగ్నేయం వైపు ఉన్న గేటు నెంబర్ రెండు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్న గేటు నెంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని ఏర్పాటు చేయనున్నారు.

బాహుబలి గేటు శాశ్వత మూసివేత
బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ గేటును పూర్తిగా మూసివేయనున్నట్టు, ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హుస్సేన్ సాగర్ వైపు కూడా మరో కొత్త గేటును పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక హుస్సేన్ సాగర్ గేటు నుంచి సీఎం లోపలికి ప్రవేశించి గేటు నెంబర్ మూడు నుండి బయటకు వెళ్లే లాగా డిజైన్ చేస్తున్నారని సమాచారం.
ప్రధాన గేటు ముందే తెలంగాణా తల్లి విగ్రహం
ఇక సచివాలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాస్తు ప్రకారం అన్ని పక్కాగా ఉండేలా రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తుంది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి సంబంధించిన పనులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. డిసెంబర్ 9వ తేదీన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.
బాహుబలి గేటును పూర్తిగా మూసివేస్తున్న కారణం ఇదేనా
అయితే మెయిన్ గేటు ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన క్రమంలో ఆ గేటు ద్వారా రాకపోకలు జరిపితే ఇబ్బంది కలుగుతుందన్న భావనలోనే బాహుబలి గేటును పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో తాజాగా చేస్తున్న వాస్తు మార్పుల పైన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రధాన గేటు మూసివేత
కాగా గత ప్రభుత్వం తెలంగాణా సెక్రటేరియట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసింది. అయితే సెక్రటేరియట్ వాస్తు ప్రకారం నిర్మాణం జరగలేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన అనతి కాలంలోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లోనే సచివాలయ ప్రధాన మహాద్వారాన్ని మూసివేశారు.
ఇప్పుడు ప్రధాన ద్వారం ఈశాన్యానికి మార్పు
ఆ మార్గం గుండా ఎలాంటి రాకపోకలు జరపడం లేదు. ఆ ద్వారాలు తెరుచుకోకుండా మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలు చుట్టారు. అయితే ప్రస్తుతం తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం అక్కడి నుంచి మార్చి ఈశాన్యం వైపున ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 27అడుగుల ఎత్తు, అంతే వెడల్పు ఉండేలా ఈ గేటును ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications