వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అందరూ ఊహించినట్టుగానే రేవంత్‌రెడ్డి టిడిపిని వీడారు. రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి కూడ పార్టీని వీడారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేంనరేందర్‌రెడ్డిని గెలిపించుకొనే క్రమంలోనే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొన్నారు. ఈ ఘటనే తెలంగాణలో టిడిపిని మరింత దెబ్బతీసిందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?

రేవంత్‌రెడ్డి టిడిపిని వీడారు. పార్టీని వీడాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు శనివారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయంలో రాజీనామా లేఖను ఇచ్చారు రేవంత్‌రెడ్డి.

ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

రేవంత్‌రెడ్డితో పాటు వేంనరేందర్‌రెడ్డి కూడ పార్టీని వీడారు. తెలంగాణలో ఇంకా మరికొందరు పార్టీ నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టిడిపి నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు.

'రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా'

వారిద్దరు మంచి స్నేహితులు

వారిద్దరు మంచి స్నేహితులు

వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మంచి స్నేహితులు. రేవంత్‌రెడ్డి టిడిపిలోకి రాకముందు నుండే వేంనరేందర్‌రెడ్డి టిడిపిలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి కంటే ముందుగానే వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రేవంత్‌రెడ్డి టిడిపిలో చేరిన తర్వాత రేవంత్‌తో వేంనరేందర్‌రెడ్డి మంచి స్నేహితులుగా మారారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నుండి ఎమ్మెల్సీ పదవి కోసం వేం నరేందర్‌రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కోరారు. అయితే ఆనాడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేంనరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బరిలో దింపింది. అయితే ఈ ఎన్నికల్లో వేంనరేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు.

నరేందర్‌రెడ్డి గెలుపు కోసం రేవంత్ ఇలా..

నరేందర్‌రెడ్డి గెలుపు కోసం రేవంత్ ఇలా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిడిపికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు, 5 బిజెపి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవచ్చని టిడిపి ప్లాన్ చేసింది. అయితే టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అయితే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో టిడిపి సంప్రదింపులు జరిపిందనే ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే రేవంత్ అరెస్టయ్యారు. ఈ కేసులో తనను ఇరికించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

రాజకీయ భవిష్యత్‌కోసమేనా?

రాజకీయ భవిష్యత్‌కోసమేనా?

వేం నరేందర్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నికై చాలా కాలం అవుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఈ తరుణంలోనే రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌పార్టీలో చేరితే తనకు రాజకీయంగా భవిష్యత్ ‌ఉంటుందని వేం నరేందర్‌రెడ్డి భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతోనే రేవంత్‌తో పాటు వేంనరేందర్‌రెడ్డి కూడ పార్టీని వీడారు. రేవంత్‌వెంట ఇటీవల ఢిల్లీకి వెళ్ళి రాహూల్‌గాంధీని కలిసినవారిలో వేంనరేందర్‌రెడ్డి కూడ ఉన్నారని ప్రచారం సాగుతోంది.

ఆ కేసుతో టిడిపికి నష్టం

ఆ కేసుతో టిడిపికి నష్టం

వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు పన్నిన వ్యూహం టిడిపికి బెడిసికొట్టింది. ఈ పరిణామాలతో తెలంగాణ నుండి చంద్రబాబునాయుడు అమరావతికి మకాం మార్చారు. ఏపీలో పాలనపై చంద్రబాబునాయుడు కేంద్రీకరించడంతో పాటు ఇతరత్రా వ్యవహరాలతో తెలంగాణ పార్టీకి చంద్రబాబునాయుడు ఎక్కవ సమయం కేటాయించలేదు. మరో వైపు ఇదే సమయంలో ఓటు నోటు కేసు వ్యవహరం తెలంగాణలో టిడిపిని ఇబ్బందులకు గురిచేసిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహ్ములు ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాజకీయ విమర్శకులు గుర్తుచేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth reddy Vem narender reddy both are best friends. Vem Narender reddy resigned to TDP with Revanth reddy.Narender Reddy may join in Congress with Revanth soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి