వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు: కేంద్రం షాకింగ్ వాదన; తీర్పురిజర్వ్!!

|
Google Oneindia TeluguNews

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన ఇప్పటికి జర్మనీ పౌరుడిగానే ఉన్నాడని పౌరసత్వాన్ని ఇంకా వదులుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ముందు రమేష్ పౌరసత్వ వివాదం పై జరిగిన విచారణలో భాగంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి సూర్య కరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేసిన కేంద్రం.. సవాల్ చేసిన వేములవాడ ఎమ్మెల్యే

చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేసిన కేంద్రం.. సవాల్ చేసిన వేములవాడ ఎమ్మెల్యే

తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్‌కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి బుధవారం తీర్పును రిజర్వ్ చేశారు. 2009 నుండి రమేష్ భారతీయ పౌరసత్వంపై వివాదాలు చుట్టుముట్టాయి. 2019లో భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఆ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగోసారి ప్రస్తుత రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

రెండు చోట్ల పౌరసత్వం... అనుమతించబడదన్న కేంద్రం

రెండు చోట్ల పౌరసత్వం... అనుమతించబడదన్న కేంద్రం

దీనిపై ఎమ్మెల్యే తరపు న్యాయవాది వై.రామారావు కోర్టుకు తమ బలమైన వాదనలు వినిపించారు. యూనియన్ ఆఫ్ ఇండియా తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్ రెడ్డి ఎమ్మెల్యే రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని వాదించారు. ఒకటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, మరొకటి చట్టంలోని సెక్షన్ 7B కింద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అయితే, రెండు చోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటం చట్టం ప్రకారం అనుమతించబడదని ధర్మాసనానికి తెలిపారు.

ఎమ్మెల్యే గా ఆయనను కొనసాగించటం ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు : కేంద్రం

ఎమ్మెల్యే గా ఆయనను కొనసాగించటం ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు : కేంద్రం

విదేశీ భారతీయ పౌరుడు ఎన్నటికీ ఎమ్మెల్యే కాలేడు. తన పౌరసత్వ సమస్య 2009 నుండి పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అతను రెండు పౌరసత్వాలలో ఒకదానిని వదులుకోవాలని నిర్ణయించుకోలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యే క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన అన్ని మెటీరియల్ ఆధారాలు మరియు పత్రాలను బెంచ్ ముందు సమర్పించారు. రమేష్ పౌరసత్వాన్ని కొనసాగించడం 'ప్రజా ప్రయోజనాలకు అనుకూలం కాదు' అని కేంద్రం చేసిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విభిన్న తీర్పులను ఉదహరించారు.

ఎమ్మెల్యే పౌరసత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ తరపు న్యాయవాది

ఎమ్మెల్యే పౌరసత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ తరపు న్యాయవాది

ఎమ్మెల్యే భారత పౌరసత్వాన్ని సవాలు చేసిన కాంగ్రెస్‌కు చెందిన ఆది శ్రీనివాస్‌ తరఫున సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు, వాస్తవాలను దాచిపెట్టి 2009లో రమేష్‌ భారత పౌరసత్వాన్ని పొందారని ధర్మాసనానికి తెలిపారు. వాస్తవాలను తప్పుగా సూచిస్తే వలస కార్మికుడు లేదా సామాన్యుడిని క్షమించవచ్చు, అయితే వాస్తవాలను దాచి పౌరసత్వం పొందే విషయంలో చట్టసభ సభ్యుడిని విడిచిపెట్టకూడదని వాదించారు.

తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం .. సర్వత్రా ఉత్కంఠ

తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం .. సర్వత్రా ఉత్కంఠ


వాస్తవానికి, చెన్నమనేని రమేష్ వాస్తవాలను దాచిపెట్టిన చర్య మోసపూరితమైన చర్య అని అభివర్ణించారు. అందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ని ప్రాసిక్యూట్ చేయాలి' అని సీనియర్ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఎమ్మెల్యే పౌరసత్వాన్ని రద్దు చేసే ముందు కేంద్రం తమను సంప్రదించలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ప్రస్తావిస్తూ, ఎమ్మెల్యే తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందారని నిరూపించే అన్ని రికార్డులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని రవికిరణ్ వాదించారు. మొత్తానికి కేంద్రం కోర్టులో బలంగా వినిపించిన వాదనలతో చెన్నమనేని రమేష్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేయడంతో, ఎటువంటి తీర్పు వస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
Center shocked Vemulawada TRS MLA Chennamaneni ramesh in citizenship case. The Center has argued that he is a citizen of two countries and such a person is ineligible to be an MLA. Bench reserved its verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X