తెరాసకు వెంకయ్య హామీ, నీటిపై కేసీఆర్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వెంటనే విభజించాలని తెరాస ఎంపీలు, ఏపీ బార్ కౌన్సెల్ చైర్మన్, సభ్యులు మంగళవారం కేంద్ర న్యాయశాఖమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెరాస ఎంపీలు మంగళవారం నాడు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కే కేశవ రావు, వినోద్ కుమార్ తదితరులు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని కలిశారు.
భద్రాచలంలోని నాలుగు గ్రామ పంచయతీలు తిరిగి తెలంగాణలోకి కలిపేందుకు యత్నిస్తామని తెరాస ఎంపీలకు వెంకయ్య హామీ ఇచ్చారు.

జైట్లీతో..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, బాల్క సుమన్ తదితరులు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీని కలిసిన దృశ్యం.

నజ్మా హెఫ్తుల్లాతో...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తదితరులు కేంద్రమంత్రి నజ్మాహెఫ్తుల్లాను కలిసిన దృశ్యం.

వెంకయ్య
తెరాస ఎంపీలు మంగళవారం నాడు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కే కేశవ రావు, వినోద్ కుమార్ తదితరులు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని కలిశారు. భద్రాచలంలోని నాలుగు గ్రామ పంచయతీలు తిరిగి తెలంగాణలోకి కలిపేందుకు యత్నిస్తామని తెరాస ఎంపీలకు వెంకయ్య హామీ ఇచ్చారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనుల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 ఏళ్లకు మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications