కొందరు కుర్చీ కోసం కులాన్ని వాడుకుంటారు: దాసరి ఇంటికి వెంకయ్య
ఇటీవల మృతి చెందిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

దాసరి అందరి గురించి ఆలోచించేవాడు
దాసరి నారాయణ రావు అందరి గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుర్చీ కోసం కులాన్ని వాడుకుంటారని వెంకయ్య అన్నారు.

ఫ్యామిలికీ వెంకయ్య సంతాపం
దాసరి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నానన్నారు. కాగా, గత నెల 30న దర్శకుడు దాసరి మృతి చెందిన విషయం తెలిసిందే.

కాంస్య విగ్రహం
ఇదిలా ఉండగా, దాసరి నారాయణరావు సంతాప సభ ఈ నెల 11న మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సందర్భంగా దాసరి కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్నిఅనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ తయారు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు కోరారని..
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. సంతాప సభలో దాసరి విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం దీనిని తయారు చేయాలని కుటుంబ సభ్యులు కోరినట్టు చెప్పారు. దీంతో పాటు, ఫిలింనగర్‌లో ఏర్పాటు చేసేందుకు తొమ్మిది అడుగుల దాసరి విగ్రహాన్నీ తయారు చేస్తున్నట్టు చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications