వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: అడ్డా కూలీని తీసుకొచ్చి హత్య.. బీమా కోసం ప్రభుత్వం ఉద్యోగి ఘాతుకం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా వెంకటపూర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 9న టేక్మాల్‌ మండలం వెంకటాపురం వద్ద కారు దగ్ధమైంది. ఈ ఘటనలో భీమ్లా తండాకు చెందిన ధర్మ మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌ సెక్రటేరియేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధర్మ కారులో సజీవదహనం కావటం స్థానికంగా మారింది.

సెల్ ఫోన్

సెల్ ఫోన్

అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులకు పలు అనుమానాలు రావడంతో ధర్మ సెల్ ఫోన్ ను ట్రేస్ చేశారు. అయితే ఫోన్ ఆన్ లోనే ఉన్నట్లు గుర్తించారు. అతను తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకోమ్మని చెప్పినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ధర్మ బతికే ఉన్నాడని తెలుసుకుని నిజామాబాద్ నగరంలోని సీసీ కెమెరాల అధారంగా ధర్మ ఎటు వెళ్లాడో గుర్తించారు. ఈనెల 17న మెదక్ వైపు వస్తుండగా అతన్ని పట్టుకున్నారు.

నిజామాబాద్ రైల్వేస్టేషన్

నిజామాబాద్ రైల్వేస్టేషన్

ధర్మను విచారించగా.. కారులో దహనమైన వ్యక్తి గురించి తెలిసింది. ధర్మ జనవరి 8న నిజామాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లి తనలాగే ఉండే అడ్డా కూలీ బాబును మచ్చిక చేసుకున్నాడు. బాబును పని ఇప్పిస్తానని చెప్పి బాసరకు తీసుకొచ్చాడు. అక్కడ బాబుకు గుండు కొట్టించి ధర్మ బట్టలు వేయించారు. ధర్మ, అతని మేనల్లుడు శ్రీనివాస్ కలిసి బాబును కారులో బీమ్లా తండాకు తీసుకెళ్లారు. దారిలో అతని మద్యం తాగించారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్ రాగానే ధర్మ, శ్రీనివాస్ బాబును హత్య చేశారు.

పెట్రోల్ పోసి

పెట్రోల్ పోసి

అనంతరం మృతదేహాన్ని డ్రైవర్ సిట్ లో కూర్చోబెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత పారిపోయారు. పోలీసులు ఘటన స్థలంలో మృతుడి కాలును చూశారు. అతడి కాలు ఉద్యోగిలా లేదని.. కూలీ పని చేసే వ్యక్తిలా ఉందని గుర్తించారు. ధర్మ కుటుంబ సభ్యుల తీరు కూడా అనుమానంగా ఉండడంతో ధర్మ సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పరిశీలించడంతో అసలు విషయం బయటకొచ్చింది.

బీమా

బీమా

ధర్మ స్టాక్ మార్కెట్, ఆన్ లైట్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పులు పెరగడంతో ఓ ప్లాన్ చేశాడు. తన పేరుపై బీమా చేయించుకుని.. తనలాగే ఉండే వ్యక్తిని హత్యే చేసి.. తాని చనిపోయినట్లు నటకం ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని భార్య, కొడుకు, చెల్లలు, మేనల్లుడి సాయం కూడా తీసుకున్నాడు. మొదటగా నవంబర్ లోనే ఈ ప్లాన్ అమలు చేయాలని చూశారు.

నవంబర్ లో ప్లాన్

నవంబర్ లో ప్లాన్

ధర్మ, శ్రీనివాస్ తో కలిసి నవంబర్ లో హైదరాబాద్ లోని నాంపల్లికి వచ్చారు. అక్కడ ధర్మ లాగా ఉండే అంజయ్యను పరిచయం చేసుకున్నారు. పని ఇప్పస్తామని చెప్పి అంజయ్యను నిజామాబాద్ తీసుకొచ్చారు. నిజామాబాద్ లో లాడ్జిలో దిగారు. అదే రోజు వారు మద్యం సేవించారు. అయితే ధర్మ అంజయ్యను భోజనం చేసి రమ్మని చెప్పాడు. బయటకొచ్చిన అంజయ్య ధర్మ, శ్రీనివాస్ వ్యవహార శైలి అనుమానంగా ఉండండంతో హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చాడు.

English summary
Sensational matters have come out in the Medak district Venkatapur murder case which has created a sensation in the state. The police have arrested the accused in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X