cold alert: తెలంగాణలో రాగల రెండ్రోజులపాటు చలితీవ్రత అత్యధికం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి మరింత అధికంగా ఉంటోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరుగుతోందని తాజాగా, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ చలి తీవ్రత సాధారణ స్థితికి వచ్చే ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. అయితే, డిసెంబర్ ఆఖరి వారం నుంచి చలి తీవ్రత మరింత పెరగడంతోపాటు శీతల గాలులు వీస్తాయని చెప్పారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతాయన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉన్నాయన్నారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు.. అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజులుగా కింది స్థాయి నుంచి తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారణి తెలిపారు. వృద్ధులు, పిల్లలు ఈ రెండు మూడు రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
-
ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications