'హైదరాబాద్‌లో గల్లీ గల్లీ తెలిసిన మంత్రులుండగా, కేటీఆర్‌కు అన్ని శాఖలా?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక్కడికే అన్ని శాఖలు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంత రావు గురువారం నాడు ప్రశ్నించారు. కేటీఆర్‌కు అన్ని శాఖలు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలో రోడ్లు, నాలాలు బాగుపడలేదు కానీ కేటీఆర్ మాత్రం విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. గల్లీ గల్లీ తెలిసిన నగర మంత్రులకు మున్సిపల్ శాఖ ఇస్తే మంచిదని వి హనుమంత రావు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి రోడ్లను చూస్తే పెట్టుబడిదారులు రారని తనకు భయంగా ఉందని విహెచ్ అన్నారు. జిల్లాలను విభజించడమే కాకుండా, ఆర్థిక సహకారం కూడా ఇవ్వాలన్నారు.

కాగా, మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో కీలక, ఎక్కువ శాఖలు ఉన్నాయి. ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ తదితర శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జిహెచ్ఎంసి ఎన్నికల అనంతరం కేటీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. అనంతరం ఆయనకు ఎక్కువ శాఖలు కట్టబెట్టారు.
కాగా, నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో నగరం మొత్తం తిరిగిన వారు ఉన్నారని, వారికి మున్సిపల్ శాఖను అప్పగిస్తే బాగుంటుందని విహెచ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications