పవన్ కల్యాణ్! అవి పట్టవా, నీ మీదా ఆరోపణలు: ఏకేసిన విహెచ్
Recommended Video

హైదరాబాద్: తెలంగాణలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెసు నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, ఎమ్మార్పియస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వంటి నాయకులను అరెస్టు చేస్తూ పవన్ కల్యాణ్ పర్యటనకు ఎందుకు అనుమతిస్తారంటూ ప్రశ్న వేస్తున్నారు.
కాంగ్రెసు నాయకుడు పొన్నం ప్రభాకర్‌తో పాటు వి హనమంతరావు కూడా పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రశ్నలు వేస్తున్నారు.

వాటిపై ఎందుకు మాట్లాడడం లేదు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవినీతి, అక్రమాలపై ఎందుకు మాట్లాడడం లేదని వి. హనుమంతరావు ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇది పవన్ కల్యాణ్‌కు కనిపించలేదా అని ఆయన అడిగారు.

ఆయనను తిరగనివ్వలేదు
కోదండరామ్‌ను రాష్ట్రంలో తిరగనివ్వలేదని, మాదిగ రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన మందకృష్ణను అరెస్టు చేశారని అంటూ అది అక్రమం కాదా అని విహెచ్ అడిగారు. పవన్ కల్యాణ్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటికి సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్‌ను ఎలా..
సినీ గ్లామర్ అడ్డు పెట్టుకుని తిరిగితే పవన్ కల్యాణ్‌కు ఓట్లు పడవని మందకృష్ణ మాదిగ అన్నారు. ఓ వైపు తమను అడ్డుకోవడానికి పోలీసులను ఉపయోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదే సమయంలో పవన్ కల్యాణ్ తిరగడానికి వారిని పెడుతోందని ఆయన అన్నారు. అర్థరాత్రి ఆందోళన కేసులో నిందితుడిగా న్న మందకృష్ణ మాదిగ బుధవారం సికింద్రాబాదు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

చట్టం అందరికీ సమానమే...
చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని మందకృష్ణ మాదిగ అన్నారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో పది రోజుల పాటు దీక్ష చేసిన కేసిఆర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన అడిగారు నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.












Click it and Unblock the Notifications