అంబర్ పేటలో వీహెచ్ నోటి దూల..! విలేఖరిపై అనుచిత వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ :ముందస్తు ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీని ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే లు పోటీ చేసేందుకు అభ్యర్థులుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని తోసిరాజంటూ పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఆశావహులు. పొత్తు లో భాగాంగా సీటు కోల్పోయిన కొంత మంది నేతలు బరిలోనుండి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకోసం అదిష్టానం మాటను దిక్కరిస్తూ నామినేషన్ దాఖలు చేసిన నియోజెక వర్గంలో రెబల్ గానో, స్వతంత్య్ర అభ్యర్థిగానో పోటీ చేసేందుకు సై అంటున్నారు నాయకులు.

తాజాగా అంబర్ పేట నియోజక వర్గంలో జనసమితి నుండి నిచ్చెన రమేష్ అభ్యర్థిగా వనామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ నుండి కూడా లక్ష్మణ్ యాదవ్ నామినేషన్ వేసారు. దీంతో పొత్తు ధర్మానికి ఈ నియోజక వర్గంలో నాయకలు తూట్లు పొడిచారనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పందిస్తూ విలేఖురులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. పొత్తు ధర్మాన్ని మరచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేసి బీజేపి అభ్యర్థిని గెలిపించబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు వీహెచ్ ఘాటుగా సమాధానం చెప్పారు. ప్రశ్న అడిగిన విలేఖరిని ఫాల్తూ ప్రశ్నలు అడగొద్దంటూ హెచ్చరికలు జారీ చేసారు. దీంతో అక్కడున్న వీహెచ్ సహచరులు అవాక్కయ్యారు. అనవసరంగా మీడియామీద నోరు పారేసుకున్న వీహెచ్ నోటిని అదుపులో పెట్టుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ వీహెచ్ ఏమన్నారో మీరే వినండి..
విలేఖరిపై వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు..! నోటిని అదుపులో ఉంచుకుంటే మంచిందంటున్న సహచరులు..!#congress #MahaKutami #Telanganaelections2018 pic.twitter.com/eUjL6ns5cn
— Oneindia Telugu (@oneindiatelugu) November 21, 2018
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications