సీఎంల గొడవపై మాట్లాడండి:రాజ్‌కు వీహెచ్, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే విద్యార్థులపై పిడిగుద్దులు
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు ఆదివారం నాడు లేఖ రాశారు. తాజా రాజకీయ పరిస్థితుల పైన కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాదులో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. నగరంలోని సెటిలర్లకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఓటుకు నోటు కేసును మరిపించేందుకే కేంద్రపాలిత ప్రాంతం, సెక్షన్ 8 అంటూ తెరపైకి తెస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి, పోలీసుల పిడిగుద్దులు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయాన్ని శనివారం ముట్టడించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యాసంస్థలు ఉదయం ముట్టడించాయి.
ఒక బృందాన్ని పోలీసులు అరెస్టు చేస్తుండగా మరో బృందం అక్కడకు చేరుకుంది. వారిలో కొందరు ఇనుప కంచెను ఎక్కేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారి పైన చేయి చేసుకున్నారు. విద్యార్థులపై పిడిగుద్దులు గుద్దారు. పోలీసులు తమను దాడి చేసి కొట్టారని విద్యార్థులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications