హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ వీడియో చూశాక పాలు కొనాలన్నా.. తాగాలన్నా ఆలోచించాల్సిందే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ దందాలపై పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఓ చోట ఈ కల్తీ వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ పాల డెయిరీలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సదరు డెయిరీపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని దబీర్‌పురలో మహ్మద్ సోహైల్ అనే వ్యక్తికి ఉన్న డెయిరీ ఫాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ డెయిరీ ఫాంలో పాలు పితికిన సోహైల్ ఆ పాలను అపరిశుభ్రం చేశాడు. పాలను పిండాక గేదె దగ్గరే ఓ చెంబును ముంచి ఆ పచ్చి పాలనే తాగేశాడు. ఆ చెంబులో మిగిలిన ఎంగిలి చేసిన పాలను పాలున్న పాత్రలో పోసేశాడు.

Video: Dabeerpura dairy farm worker adulterating milk, arrested

అంతేగాక, అతను తాగగా ఖాళీ అయిన పాల స్థానంలో గేదెలు తాగే కుడితి తొట్టిలో ఉన్న మురికి నీటిని ముంచి బాకెట్లోని పాలలో పోశాడు. అయితే, ఇదంతా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంచడంతో అది వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ డైరీ ఫాం యజమాని సోహైల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.

గోల్కబార్‌లోని జహంగీర్ డెయిరీ ఫాంపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 269, 273 కింద కేసులు నమోదు చేశారు.

English summary
The Hyderabad Dabeerpura Police have arrested the owner of a dairy farm in the area on August 19th after instances of milk adulteration came to light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X