Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేబినెట్ లోకి రాములమ్మ, ఆ ఇద్దరు ఔట్ - అయిదుగురితో ఢిల్లీ ఫైనల్ లిస్టు..!!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీ వేదికగా అనేక తర్జన భర్జనలు జరిగాయి. ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ విస్తరణతో పాటుగా టీపీసీసీ కమిటీ నియామకాల పైన తుది నిర్ణయానికి వచ్చారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్య త ఇస్తూ తుది రూపు ఇస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరి పైన వేటు ఖాయమని పార్టీ నేతల సమాచారం. కొత్తగా అయిదుగురు పేర్లు ఖరారు చేసారు. ఇక, విజయ శాంతికి మంత్రిగా అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఢిల్లీ ఫైనల్ లిస్టు ఆసక్తి కరంగా మారుతోంది.

కసరత్తు పూర్తి
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలిక్కి వచ్చింది. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణతో పాటు.. పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏఐసీసీ ముఖ్య నేతలు తెలంగాణ మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించడంపై నిర్ణయం తీసుకున్నారు. కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాగా, ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకోగా. .ఈ రోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

vijaya-santhi-chances-to-induct-in-revanths-cabinet-as-high-command-decision

రాములమ్మ - దయాకర్
ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. ఇక.. మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానచలనం తప్పదనే చర్చ వినిపిస్తోంది. మంత్రులు గా తొలిగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా.. మరో మంత్రి పేరు తెర మీదకు వస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ సన్నిహిత నేత అద్దంకి దయాకర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ఉండగా.. ఇప్పుడు దయాకర్ పేరు తెర మీదకు వచ్చింది. దీంతో, ఈ ఇద్దరిలో ఎవరికి చివరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.

ఢిల్లీకి రేవంత్
ఈ నెల 4న సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ సైతం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. పార్టీ చీఫ్ ఖర్గే తో పాటుగా రాహుల్ తోనూ ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ.. సామాజిక వర్గాల వారీగా అవకాశం.. టీపీసీసీ కూర్పు పైన అధికారికంగా ఆమోద ముద్ర తీసుకోనున్నారు. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఇక.. జూలై లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా పట్టు సాధించే క్రమంలో రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ నెల 4న ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+