అన్నాడీఎంకే పార్టీని నడిపించండి: శశికళను కలిసిన విజయశాంతి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు.

హైదరాబాద్/చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మతో సమావేశమయ్యారు.

Vijayasanthi meets Sasikala in poes gardern

అన్నాడీఎంకే పార్టీని ముందు ఉండి నడిపించాలని ఈ సందర్భంగా శశికళను విజయశాంతి కోరారు. అంతకుముందు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయలలిత మృతి తీరని లోటు అన్నారు.

కాగా, జయలలిత ఈ నెల 5వ తేదీన రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి అనంతరం ప్రస్తుతం అనధికారికంగా పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వచ్చాయి. త్వరలో ఆమెను పార్టీ చీఫ్‌గా ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+